పాన్ ఇండియా మూవీలో మరో మెగా హీరో.. ఎవరంటే..!

- Advertisement -

టాలీవుడ్ లో ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా రేంజ్ సినిమాలు నిర్మిస్తున్నారు. తెలుగు సినిమాలకు మార్కెట్ పెరగడంతో భారీగా ఖర్చు పెట్టడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు. బాహుబలి ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన తర్వాత తెలుగులో వరుసగా పాన్ ఇండియా సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్, హరిహర వీరమల్లు, సర్కారు వారి పాట, పుష్ప, అహం బ్రహ్మాస్మి, శంకర్ -చరణ్ కాంబో తదితర సినిమాలు పాన్ ఇండియా కేటగిరి లో నిర్మితమవుతున్నాయి.

ఇప్పటికే మెగా హీరోలు పవన్ కళ్యాణ్, చరణ్, అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ లోని మరో హీరో వరుణ్ తేజ్ కూడా ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నాడు. ఇప్పటికే వరుణ్ తేజ్ నటిస్తున్న గని సినిమా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్ల కోసం ఏకంగా హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ లార్నెల్ స్టోవల్, వ్లడ్ రింబర్గ్ పని చేస్తున్నారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ ఓ పాన్ ఇండియా సినిమా ఒప్పుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్ డేట్ ఆగస్టు 15వ తేదీన రానున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు ఆ రోజే తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ నటిస్తున్న గని దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల కానుంది. అలాగే వెంకీతో కలిసి వరుణ్ నటిస్తున్న ఎఫ్ -3 సంక్రాంతికి విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -