Saturday, May 18, 2024
- Advertisement -

నాకు సెకండ్ వ‌ద్దు.. ఫ‌స్ట్ కావాలంటున్న హీరోయిన్‌

- Advertisement -

రెండు పెద్ద సినిమాల‌ను రిజెక్ట్ చేసిన సుర‌భి

చిన్న సినిమాల‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా పెద్ద పెద్ద సినిమాలు రాలేదు. ఒక‌వేళ పెద్ద సినిమాలు వ‌చ్చినా అందులో సెకండ్ హీరోయిన్ పాత్ర‌లు రావ‌డంతో ఓ హీరోయిన్ తెగ బాధ‌ప‌డుతోంది. సెకండ్ హీరోయిన్ అంటే అంత‌గా గుర్తింపు ఉండ‌దు.. పైగా రెమ్యున‌రేష‌న్‌ కూడా త‌క్కువ మొత్తంలో వ‌స్తుండ‌డంతో హీరోయిన్ ఆందోళ‌నలో ప‌డింది. ఇప్పుడు సినిమా అంటూ చేస్తే మొద‌టి హీరోయిన్‌గానే చేస్తాను.. రెండో హీరోయిన్‌గా అస్స‌లు చేయ‌ను అని ప‌ట్టుబ‌ట్టి కూర్చింది. ఆ హీరోయినే సుర‌భి.

అందం.. న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటూ ఇప్పుడు ఎలాగైనా మొద‌టి హీరోయిన్‌గా సినిమా అవ‌కాశాలు ప‌ట్టేస్తా అని ధీమాగా సుర‌భి ఉంది. సెకండ్ హీరోయిన్ పాత్రలు చేస్తూ పోతుండ‌డంతో హీరోయిన్ అవకాశాలు రావ‌డం లేద‌ని బాధ‌ప‌డుతోంది. ప్ర‌స్తుతం సెకండ్ హీరోయిన్ పాత్ర‌ల కోసం సినిమా అవ‌కాశాలు వ‌రుస‌గా వ‌స్తుండ‌డంతో నేను చేయ‌ను అని వారిని వెన‌క్కి పంపించేస్తోంది. బీరువా సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఆ త‌ర్వాత ‘ఎక్స్‌ప్రెస్ రాజా’లో నటించి మొన్ననే ‘ఒక్క క్షణం’తో మనల్నిపలకరించిన హీరోయిన్ త‌ర్వాత రెండో హీరోయిన్‌గా అవ‌కాశాలు వ‌చ్చాయి.

అన్ని సెకండ్ హీరోయిన్ అవకాశాలే వస్తుండ‌డంతో ఆందోళ‌న‌లో ఉంది. నితిన్‌, రాశీఖన్నానటిస్తున్న ‘శ్రీనివాస కల్యాణం’లో రెండో హీరోయిన్‌గా అవకాశం వస్తే చేయ‌న‌ని చెప్పేసింది. తాను మెయిన్‌ హీరోయిన్‌గా మాత్రమే చేస్తాను అని ఆ అవకాశాన్ని పక్కకు తోసేసింది. రామ్ – అనుపమ నటిస్తున్న‘ హలో గురు ప్రేమ కోసమేరా’ సినిమాలో కూడా అవ‌కాశం వ‌స్తే చేయ‌ను అని తెగేసి చెప్పేసింది. ఈ విధంగా సెకండ్ హీరోయిన్ సినిమా అవ‌కాశాల‌ను రిజెక్ట్ చేసేసి మెయిన్ పాత్ర‌లో వ‌చ్చే సినిమాల‌నే చేస్తాన‌ని చెప్పేసింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -