Saturday, May 18, 2024
- Advertisement -

సల్మాన్, జయల కేసుల్లో తీర్పులు మారిపోయాయేంటి!

- Advertisement -

కింది కోర్టులేమో వీళ్లను దోషులగా నిర్ధారించాయి. వాళ్లు తప్పు చేశారని నిర్ధారించి జరిమానాలు, శిక్షలు విధించాయి. వాళ్లు బయట ఉండటానికి అర్హతలేని వారని… చేసిన తప్పుకు గానూవారిని జైల్లో ఉంచడమే రైటని నిర్ధారించాయి.

ఆ మేరకు తీర్పునిచ్చాయి. మొదటగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత విషయంలో అదే జరిగింది. జయ అక్రమాస్తుల కేసును దశాబ్దానికిపైగా విచారించిన కర్ణాటక కోర్టు జయకు ఐదు సంవత్సరాల శిక్షను, వంద కోట్ల రూపాయల జరిమానాను విధించింది.

అక్రమాస్తుల కేసులో జయలలిత దోషి అని ఆ కోర్టు నిర్ధారించింది. అయితే ఇప్పుడు పై కోర్టు మాత్రం జయను నిర్ధోషిగా ప్రకటించింది. అక్రమాస్తుల కేసులో ఆమె ది తప్పు లేదని.. ఆమెపై నమోదు అయినది అక్రమమైన కేసేనని కోర్టు తేల్చింది. ఆమెను నిర్దోషిగా విడుదల చేసింది.

ఇక సల్మాన్ కేసు విషయానికి వస్తే.. రెండు రోజుల్లో పరిణామాలు మారిపోయాయి. సల్మాన్ కేసును విచారించిన కోర్టుఅతడిని దోషిగా తేల్చి శిక్షను విధించింది. అయితే వెంటనే బెయిలు వచ్చింది. పై కోర్టులో ఆయన శిక్షనే సస్పెన్షన్ కు గురి అయ్యింది. దీంతో సల్మాన్ కు పూర్తిగా కాకపోయినా.. కొంత వరకూ విముక్తిలభించింది. ఈ విధంగా రెండు వేరు వేరు కోర్టుల్లో ఇద్దరు సెలబ్రిటీలు బయటపడిపోయారు!

కింది కోర్టుల్లో దోషిగా నిర్ధారణ అయిన వ్యక్తులకు పైకోర్టుల్లో ఊరట లభించింది. మరి దీంతో కోర్టు కోర్టు కూ న్యాయం మారుతుందని అనుకోవాల్సి వస్తోంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -