Saturday, April 20, 2024
- Advertisement -

మ‌రో ప‌వ‌ర్ పుల్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న సూర్య‌…అభిమానుల్లో పెరుగుతున్న అంచ‌నాలు

- Advertisement -

హీరో సూర్య ఎలాంటి పాత్రలోకైనా సరే పరకాయ ప్రవేశం చేస్తాడు. సూర్య నటించలేని పాత్ర అంటూ లేదని ఇప్పటికే అతడు నటించిన చిత్రాల ద్వారా అర్థం అయింది. సింగం సిరీస్ లో పోలీస్ ఆఫీసర్ గా నటించిన సినిమాలు ఎంత‌టి హిట్‌ను సాధించాయో అంద‌రికీ తెల‌సిందే.

జయాపజయాలను గురించి పెద్దగా పట్టించుకోకుండా సూర్య వరుస సినిమాలు చేసేసుకుంటూ వెళుతున్నాడు. తనకి హిట్ ఇచ్చిన దర్శకులకు మళ్లీ మళ్లీ అవకాశాలను ఇవ్వడం సూర్యకు అలవాటు. అలా గతంలో ‘వీడొక్కడే’ .. ‘బ్రదర్స్’ వంటి చిత్రాలతో తనకి మంచి గుర్తింపు తెచ్చిన కేవీ ఆనంద్ తో సూర్య ఇప్పుడు మరో సినిమా చేస్తున్నాడు.

Image result for suriya-role-kv-anand-film-revealed

కెవి ఆనంద్, సూర్య కాంబోలో తెరకెక్కే చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. షూటింగ్ లొకేషన్ నుంచి లీకైన సూర్య లుక్ అదుర్స్ అనిపించే విధంగా ఉంది. దీనితో సూర్య ఎలాంటి పాత్రలో నటిస్తున్నాడు అనే ఆసక్తి అభిమానుల్లో ఎక్కువైంది. సూర్య పాత్ర గురించి జరుగుతున్న ప్రచారం ఆసక్తి రేపుతోంది.

ఈ సినిమాలో ఆయన పవర్ ఫుల్ కమాండో పాత్రలో కనిపించనున్నాడనేది తాజా సమాచారం. కెవి ఆనంద్ శైలిలో ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్, ఛేజింగ్ సీన్స్ భారీ స్థాయిలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ సినిమాలో మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్, హీరో ఆర్య, బోమన్ ఇరానీ కీలక పాత్రలో నటిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -