Monday, May 6, 2024
- Advertisement -

అనుష్క‌, విరాట్‌ల ఆస్తులు చూస్తే దిమ్మ తిర‌గాల్సిందే…

- Advertisement -

వాల్లిద్ద‌రూ స్టార్‌లు. ఒక్కొక్కు తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు. వాటి సాయంతో కోట్లు సంపాదిస్తున్నారు. తమ శ్రమనే పెట్టుబడిగా పెట్టి.. తమ బ్రాండ్ వ్యాల్యూని కోట్ల రూపాయలకు పెంచుకోగలుగుతున్నారు. ఇదంతా ఎవ‌రి గురించి అనుకుంటున్నారా….? ఒక‌రు క్రికెట్ స్లార్ విరాట్ కోహ్లీ…మ‌రోక‌రు స్టార్ హీరోయిన్ అనుష్క‌శ‌ర్మ‌.

ఇద్ద‌రూ కొన్నాళ్లుగా ప్రేయసీ ప్రియులుగా ఉన్న వీళ్లు ఇప్పుడు భార్యభర్తలు అయ్యారు. ఇట‌లీలో వివాహం చేసుకున్నారు. ఈ సెలబ్రిటీ కపుల్‌ను ఇపుడు అంతా ‘పవర్ కపుల్’ అని పిలుస్తున్నారు. అయితే ఇప్పుడు వీల్ల ఆస్తుఎంత అనేది హాట్ టాపిక్‌గా మ‌రాంది. వీళ్లిద్దరూ ఉమ్మడిగా ఒక బ్రాండ్ గా మారారు. పెళ్లితో వీరి క్రేజ్ రెట్టింపు అయినట్టే.. మరింత రెప్యూటేషన్ ను పెంచుకున్నారు వీళ్లిద్దరూ. ఈ నేపథ్యంలో వీళ్ల బ్రాండ్ వ్యాల్యూ కూడా పెరిగినట్టే అని.. వీళ్ల సంపాదన మరింత పెరగబోతోందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

తాజాగా వీళ్ల ఆస్తులు లెక్కగట్టిన ఓ బ్రాండ్ ఎనలిస్ట్ వీళ్లిద్దరి ఆస్తులు కలిపి దాదాపు రూ. 600 కోట్లు ఉంటుందని లెక్కతేల్చారు. ఈ జంట ఆస్తుల విలువ వచ్చే రెండేళ్లలో రూ. 1000 కోట్లకు చేరుతుంద‌న‌డంలో సందేహంలేదు. ఫిన్ యాప్ అంచనా ప్రకారం… విరాట్ కోహ్లి రూ. 382 కోట్లు, అనుష్క శర్మ రూ. 220 కోట్ల విలువ చేసే ఆస్తులు కలిగి ఉన్నారు. విరాట్ కోహ్లి మ్యాచ్ ఫీజు, ఐపీఎల్ సాలరీ, ఇతర ఆదాయం, బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా ఈ భారీ మొత్తం సంపాదించారు. అనుష్క శర్మ సినిమాల రెమ్యూనరేషషన్, బ్రాండ్ ఎండార్స్మెంట్లు, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ల ద్వారా ఇంత ఆస్తి కూడబెట్టిందట. గడిచిన మూడేళ్లలో అనుష్క ఆదాయం 80శాతం పెరిగింది. ఈ అంచనాల ప్రకారం వచ్చే మూడేళ్లలో ఆమె ఆస్తుల విలువ 30 శాతం, సంవత్సర ఆదాయం 18 శాతం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

అనుష్క ఒక్కో సినిమాకు రూ. 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. బ్రాండ్ ఎండార్స్మెంట్లకు రూ. 4 కోట్లు చార్జ్ చేస్తున్నారు. ఆమె రియల్ ఎస్టేట్ రంగంలో ముంబైతో పాటు ఇండియా వ్యాప్తంగా రూ. 40 కోట్లు వ్యక్తిగతంగా ఇన్వెస్ట్ చేశారు. విరాట్ కోహ్లి సంవత్సరానికి రూ. 120 కోట్ల వరకు సంపాదిస్తున్నారు. అతడి వరల్డ్ క్లాస్ రికార్డ్స్ వల్ల ప్రపంచంలో హయస్ట్ పెయిడ్ స్పోర్ట్స్ సెలబ్రిటీగా, స్పోర్ట్స్ ప్లేయర్‌గా వెలుగొందుతున్నాడు. అతడికి రూ. 9 కోట్ల విలువ చేసే ఆరు కార్లు మెర్సిడెజ్, ఆడి, బిఎండబ్ల్యు, వాగ్స్ వ్యాగన్ ఉన్నాయి.

రానున్న మూడేళ్లలో విరాట్, అనుష్కాల ఆస్తుల విలువ ఉమ్మడిగా వెయ్యి కోట్ల రూపాయల వరకూ రీచ్ అయ్యే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇండస్ట్రీలో ‘పవర్‌ కపుల్‌’గా గుర్తింపు తెచ్చుకున్న విరాట్‌, అనుష్క ఇప్పటికే 28 బ్రాండ్లకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. మున్ముందు ఇద్దరూ కలిసి బ్రాండ్లకు ప్రచారకర్తలుగా వ్యవహరించే అవకాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -