- Advertisement -

ప్యాంట్ త‌డిపేసుకున్న ధోని హీరో

- Advertisement -

సినిమా హీరో ప్యాంట్ త‌డిపేసుకున్నాడు. హీరో అయ్యిండి ప్యాంట్ త‌డిపేసుకోవ‌డ‌మేమిటి అనుకునేరు. అదంతా ఫొటో స్టిల్స్ కోస‌మ‌ట‌. విభిన్నంగా ప్ర‌య‌త్నించి హాట్ టాపిక్‌గా కావ‌డంలో సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారు ఆరితేరినవాళ్లు. ఏది చేసినా భిన్నంగా.. ట్రెండీగా ఉండాల‌ని చూస్తుంటారు. స్టిల్స్ ఇవ్వ‌డంలో హీరోయిన్స్‌తో పోటీప‌డి హీరోలు ఇచ్చేస్తారు. షారూక్‌, స‌ల్మాన్‌, అమీర్‌ఖాన్‌లు స్టిల్స్ ఇచ్చి అమ్మాయిల గుండెల్లో క‌వ్వింత‌లు రేపుతారు. అదే హీరోయిన్లు హాట్ ఫొటో షూట్స్ తో అందాలను ఆర‌బోసి కుర్రకారు మ‌తిపోగొడుతారు. మ‌న ధోని సినిమా హీరో అయితే ఒక అడుగు ముంద‌డుగు వేసి మ‌రీ కొత్త త‌ర‌హాలో ప్ర‌య‌త్నించి ఆక‌ర్షిస్తున్నాడు.

బాలీవుడ్‌లో అడ‌ద‌ద‌డ‌ప సినిమాలు చేస్తున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఓ డిఫ‌రెంట్ స్టిల్స్ ఇచ్చి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఇటీవల చేసిన ఒక ఫొటో షూట్ డిఫ‌రెంట్‌గా ఉండ‌డంతో హాట్‌టాపిక్‌గా మారింది. సుశాంత్ ఫుల్లుగా తాగేసి ఒక కుర్చీలో తూలిప‌డ‌గా .. ప్యాంట్‌లో పోసేసుకున్న‌ట్టు ఉంది. సగం వరకు తన జీన్స్ ప్యాంట్‌ను తొలగించి ఉన్నాడు. ఆ త‌డిసిన ప్యాంట్‌ను డ్ర‌య‌ర్‌తో ఎండిపోయేలా చేస్తున్న స్టిల్ వైర‌ల‌య్యింది.

 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -