Tuesday, May 7, 2024
- Advertisement -

ర‌ష్య‌న్ యువ‌కుడితో శ్రియ పెళ్లి ?

- Advertisement -

తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ శ్రియ. ప్ర‌స్తుతం అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తున్నశ్రియకు పెద్దగా అవ‌కాశాలు మాత్రం రావ‌టం లేదు.బాల‌య్య పక్క‌న పైస‌వ‌సూల్ చేసిన ఫ‌లితం మాత్రం నిరాశ‌కు గురి చేసింది.ప్ర‌స్తుతం శ్రియ మంచు విష్ణు పక్క‌న గాయ‌త్రి సినిమాలో హీరోయిన్‌గా చేస్తుంది.శ్రియ పెళ్లి గురించి ఓ వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది.సౌత్ లో సీనియర్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రియ త్వరలో పెళ్లి పీటలెక్కనుందన్న వార్త ఇప్పుడు ఫిలింసర్కిల్స్‌ లో హాట్‌ టాపిక్ గా మారింది. 35 ఏళ్ల వయసులోనూ ఈ జనరేషన్‌ హీరోయిన్‌ లకు గ్లామర్ లో పోటి ఇస్తున్న ఈ భామ సీనియర్‌ హీరోల సరసన నటిస్తూ కెరీర్‌ కొనసాగిస్తోంది.

ఈ భామ మార్చిలో పెళ్లికూతురు కానుందన్న వార్త హాట్ టాపిక్ అదుతుంది.ఇటీవల పరిచయం అయిన ఓ రష్యన్‌ యువకుడితో శ్రియ సన్నిహితంగా ఉన్నట్టుగా వార్తలు వినిపించాయి. ఆ యువకుడినే వచ్చే నెలలో వివాహమాడేందుకు రెడీ అవుతుందట. తన విషయంపై అబ్బాయి తరపు వారితో మాట్లాడేందుకు శ్రియ ప్రస్తుతం రష్యా వెళ్లినట్టుగా ప్రచారం జరుగుతోంది. డెహ్రడూన్‌ కు చెందిన ఈ భామ డెస్టినేషన్‌ వెడ్డింగ్ తరహాలో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. రాజస్థాన్ లో శ్రియ పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయిట.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -