Thursday, May 16, 2024
- Advertisement -

నాని ఎన్టీఆర్‌లా మెప్పిస్తాడా? చిరులాగా తుస్సుమ‌నిపిస్తాడా..!

- Advertisement -

బిగ్‌బాస్ రెండ‌వ సీజ‌న్‌కు యాంక‌ర్‌గా న్యాచుర‌ల్ స్టార్ నాని ఎంపిక అయిన ద‌గ్గ‌ర నుండి అనేక అనుమానాలు,ఎన్నో సందేహ‌లు.బిగ్‌బాస్ మొద‌టి సీజ‌న్‌కు యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ వాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే.అయితే రెండువ సీజ‌న్‌కు ఎన్టీఆర్ దూరం అయ్యాడు.త్రివిక్ర‌మ్ సినిమాతో ఎన్టీఆర్ బిజిగా ఉండ‌టంతో బిగ్‌బాస్ రెండ‌వ సీజ‌న్‌కు ఎన్టీఆర్ యాంక‌రింగ్ చేయ‌డం లేదు.

బిగ్‌బాస్ తెలుగులో మొద‌లు పెట్టిన‌ప్పుడు ఇలాంటి షోలు తెలుగులో ఎవ‌రు చూడ‌ర‌నే కామెంట్స్ వినిపించాయి.అయితే అంద‌రి అనుమానాల‌ను నివృత్తి చేస్తు తెలుగులో బిగ్‌బాస్ షో సూప‌ర్ హిట్ అయింది.రేటింగ్స్‌లో కూడా ఈ షో టాప్‌లో ఉంది.బిగ్‌బాస్ మొద‌టి సీజ‌న్ అంతటి హిట్ కావ‌డానికి ఎన్టీఆర్ కూడా ఓ కారణంగా చెప్ప‌వ‌చ్చు.ఎన్టీఆర్ త‌న స‌హ‌జ సిద్ద‌మైన న‌ట‌న‌తో షోని న‌డిపించాడు.త‌న వాక్చ్‌తుర్యంతో అంద‌రిని అల‌రించాడు.బిగ్‌బాస్‌లో యాంక‌రింగ్ చేయ‌డం ద్వారా ఎన్టీఆర్ వెండితెర మీద‌నే కాదు బుల్లితెర మీద కూడా తాను హీరోనే అని నిరుపించుకున్నాడు.

అయితే రెండువ సీజ‌న్‌కు ఎంపికైన నాని ఎన్టీఆర్ స్థాయిలో మెప్పించ‌గ‌లడా అనే అనుమానం క‌లుగుతుంది.నాని కూడ త‌న స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో న్యాచుర‌ల్ స్టార్‌గా ఎదిగాడు.అయితే ఎన్టీఆర్ షోలో పోల్గొన్న వారితో బాగా క‌లిసిపోయ్యేవాడు. మ‌రి నాని ఆ విధాంగా చేయ‌గ‌ల‌డా అనేది అనుమాన‌మే.నాని సినిమాల‌లో త‌ప్ప బ‌య‌ట పెద్ద‌గా ఎవ‌రితోను క‌ల‌వ‌డు.పైగా ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఉన్న‌ అంద‌రితో ఫ్రీగా ఉంటాడు.కాని నాని అలా కాదు కొంద‌రితోనే ఫ్రీగా ఉంటాడు.మ‌రి దీనిని బ‌ట్టి చూస్తే బిగ్‌బాస్ షోలో నాని ఎన్టీఆర్ స్టాయిలో మెప్పించ‌డం క‌ష్ట‌మే.ఏదైనా ఫ‌స్ట్ ఇంప్రెష‌న్ బెస్ట్ ఇంప్రెష‌న్ అని అంటారు.ఇలాగే చేసి చేతులు కాల్చుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.

మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు ప్రొగ్రాంకు మొద‌టి కింగ్ నాగ‌ర్జున యాంక‌రింగ్ చేశారు. త‌రువాత ఈ షోకి మెగాస్టార్ చిరంజీవి వాఖ్యాత‌గా  వ్య‌వ‌హ‌రించాడు.నాగ్ యాంక‌రింగ్ చేసినప్పుడు ఈ షోకి టాప్ రేటింగ్స్ వ‌చ్చాయి.త‌రువాత చిరు వాఖ్యాత‌గా ఉన్న‌ప్పుడు యావ‌రేజ్ రేటింగ్స్ కూడా సాధించ‌లేక‌పోయింది మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు.నాగ‌ర్జున మెప్పించినట్లు చిరంజీవి మెప్పించ‌లేక‌పోయాడ‌ని అప్ప‌ట్లో చాలామంది అభిప్రాయపడ్డారు.దీంతో మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు ప్రొగ్రాంను ఆపేశారు.మ‌రి నాని ఎన్టీఆర్‌లా దూసుకుపొతాడో..చిరంజీవిలా తుస్సుమ‌నిపిస్తాడో చూడాలి అంటే జూన్ 10 వ‌ర‌కు ఆగాల్సిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -