ఎండాకాలం వచ్చిందంటే చాలు దేశంలోని పలు ప్రాంతాల ప్రజలు గుక్కెడు నీటికోసం నానా కష్టాలు పడాల్సిందే. మంచి నీటి ఎద్దడి కోసం ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలుకూడా అంతంత మాత్రమే. రాజస్థాన్ రాష్ట్రంలోని ఆజ్మీర్ చుట్టు పక్కల ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
పరిస్థితి ఎలా ఉందంటే దొరికిన నీటిని నిల్వ చేసుకుని, వాటికి తాళాలు వేసుకునేంత పరిస్థితులు ఉన్నాయి. విశాల్ నగర్ వాసులు తమ వాటర్ డ్రమ్‌లకు తాళాలు వేసుకుంటున్నారు. నీళ్లు దొరికినప్పుడే డ్రమ్ములు నింపుకుని నిల్వ చేసుకుంటున్నారు.
తమకు తాగు నీరు ప్రతిరోజు రావడం లేదని, వచ్చినప్పుడే ఇలా నిల్వ చేసుకుని పెట్టుకుంటున్నామని, నీళ్లను కూడా కొందరు చోరీ చేస్తుండడంతో తాళాలు వేస్తున్నామని విశాల్ నగర ప్రాంత వాసులు చెబుతున్నారు.ఎండా కాలంలో రాజస్థాన్‌లో ఇటువంటి పరిస్థితులు ఏర్పడడం మామూలే అయినా ఈసారి ఈ సమస్య మరింత పెరిగిపోయింది.
