Sunday, May 5, 2024
- Advertisement -

ధైర్యం ఉంటే సమంత ను బిగ్ బాస్ హౌస్ లోకి పంపమంటున్న శ్వేత

- Advertisement -

ప్రముఖ యాంకర్ శ్వేతారెడ్డి బిగ్ బాస్ నిర్వాహకులపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీ రెడ్డి కూడా బిగ్ బాస్ క్రియేటివ్ కన్సల్టెంట్ అభిషేక్ ముఖర్జీ తనపై అసభ్యకరమైన కామెంట్లు చేశారని ఆరోపించింది. బిగ్ బాస్ హౌస్ లో నుంచి మొదటి వారం ఎలిమినేట్ అయిపోయిన హేమ కూడా ఇంటి లోపలికి వెళ్లే ముందు తనను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమన్నారు అని చెప్పుకొచ్చింది. ఇవన్నీ అసలు రియాలిటీ షో అయిన బిగ్ బాస్ వారికి ఎందుకు అంటూ శ్వేతా రెడ్డి ఫైర్ అవుతోంది. ఫస్ట్ ఎపిసోడ్ లో నాగార్జున బిగ్ బాస్ ని సంస్కారవంతమైన షో అని అన్నారని, ఒక వైపు ఆయన భార్య అమల జంతువుల సంరక్షణ కోసం పాటుపడుతూ ఉంటే మరోవైపు బిగ్బాస్ మేనేజ్మెంట్ ఆడవాళ్ళను కనీసం జంతువుల లాగా కూడా చూడటం లేదని మండిపడ్డారు.

వారు రియాలిటీ షో చేయడం కంటే పోర్న్ మూవీస్ తీసి యూట్యూబ్లో విడుదల చేయడం మేలని కామెంట్లు చేశారు. “నాగార్జున డబ్బుల కోసం ఎంత పనైనా చేసేస్తారా? ఆయనకు నిజంగా ధైర్యం ఉంటే అమల మరియు సమంతా లను బిగ్ బాస్ హౌస్ లోకి పంపమని చెప్పండి. అప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. నాగార్జున గారికి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు. 60 ఏళ్ళ వయసులో ‘మన్మధుడు 2’ సినిమా లిప్ లాకులు పెట్టి ఏదో యంగ్స్టర్ లాగా తనను తాను సమర్థించుకుంటున్నారు కానీ మేము వెలుగులోకి తీసుకు వచ్చిన ఒక అంశంపై ఆయన ఎందుకు రియాక్ట్ అవటం లేదు? అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా వార బాధని గాలి బుడగల తో పోల్చినందుకు నాగార్జున పై విరుచుకుపడి తమ ఓయూ సోదరులు ఈ విషయాన్ని ఇంతటితో వదలరని హెచ్చరించారు శ్వేతా రెడ్డి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -