Friday, May 17, 2024
- Advertisement -

సైరా సుదీప్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన సినిమా టీమ్‌

- Advertisement -

టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా సురేంద‌ర్ రెడ్డి డైరెక్స‌న్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో కన్నడ నటుడు కిచ్చ సుదీప్‌ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. శుక్రవారం సుదీప్‌ బర్త్‌డే సందర్భంగా సైరా టీమ్‌ ఓ స్పెషల్‌ మోషన్‌ పోస్టర్‌ విడుదల చేసింది. ‘హ్యాపీ బర్త్‌ డే అభినయ చక్రవర్తి’ అంటూ విష్‌ చేసింది. ఒంటినిండా నల్లని వస్త్రాలతో, చేతిలో ఆయుధంతో పోజిచ్చిన సుదీప్‌ స్టిల్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఇటీవల మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన టీజర్.. ‘సైరా’ సినిమాపై అంచనాలను పెంచేసింది. తాజాగా శనివారం నాడు అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్ లుక్‌ను విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించిన నిర్మాణ సంస్థ కొద్దిసేపటి క్రితం సుదీప్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

అవుకురాజు పాత్రలో సుదీప్ ఇంతకు ముందెన్నడూ కనిపించని రీతిలో డిఫరెంట్ లుక్‌లో సర్ ప్రైజ్ చేశారు. నల్లటి వస్త్రాలు ధరించి, నుదిటిన బొట్టు, మెలితిప్పిన కోర మీసంతో.. భుజంపై గొడ్డలి, ఒరలో కత్తితో యుద్దానికి సిద్ధంగా ఉన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -