Monday, April 29, 2024
- Advertisement -

హీరోపై అత్యాచార కేసు?

- Advertisement -

హాలీవుడ్ యాక్ష‌న్ హీరో సిల్వెస్టర్ స్టాలోన్‌పై అత్యాచారం కేసు న‌మోదైన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.సిల్వెస్టర్ స్టాలోన్ త‌న‌ను అత్యాచారం చేశాడంటు ఓ మ‌హిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టనున్నారు.అయితే ఇక్క‌డ విష‌యం ఏమిటంటే ఈ అత్యాచారం జ‌రిగింది ,ఇప్పుడు కాదు 28 సంవ‌త్సరాల క్రితం ఈ అత్యాచారం జ‌రిగిందని చెబుతున్నారు.

1990లలో లాస్ వేగాస్ కు చెందిన ఓ మహిళ సిల్వెస్టర్ ఆటోగ్రాఫ్ కోసం అతడి వద్దకు వెళ్లగా.. తన రక్షకుడితో కలిసి అతడు ఆమెను అత్యాచారం చేసినట్లు గతేడాది డిసంబర్ లో కేసు పెట్టింది సదరు మహిళ.ఈ విష‌యాన్ని ఎక్కడైనా చెబితే చంపేస్తామ‌ని హెచ్చ‌రించార‌ని స‌ద‌రు మ‌హిళ త‌న ఫిర్యాదులో తెలిపింది.ఆమె చేసే ఆరోపణల్లో నిజం లేదని స్టాలోన్ తరఫు న్యాయవాది అంటున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -