Saturday, May 18, 2024
- Advertisement -

పీసీసీ అధ్యక్షుడిగా త‌న మ‌నిషే కావ‌లంటున్న‌ చంద్రబాబు?

- Advertisement -

అదేంటీ చంద్ర‌బాబు తెలుగుదేశం కదా! పీసీసీ అధ్య‌క్షుడు కాంగ్రెస్ పార్టీలో కాదా ఉండేది అనే డౌట్ మీకు రావ‌చ్చు.అవును ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మొన్నటి వ‌రుకు బీజేపీతో అంట‌గాగిన సంగ‌తి తెలిసిందే.అయితే ప్ర‌జ‌ల‌లో బీజేపీపై తీవ్ర వ్య‌తిరేక‌త‌ను గ‌మ‌నించిన చంద్ర‌బాబు వెంట‌నే బీజేపీ నుండి తెగ‌దెంపులు చేసుకున్నారు.ప్ర‌త్యేక హోదా సాధించ‌డంలో చంద్ర‌బాబు ఘోరంగా విఫ‌లం చెందడంతో బాబు ఇమేజ్ డ్యామేజ్ అయింది.

ఇందులో నా త‌ప్పు లేదు బీజేపీనే మ‌న‌ల్ని మోసం చేసింద‌ని ,వైఎస్ఆర్‌సిపి,బీజేపీ క‌లిసి నాట‌కాలు ఆడుతున్నార‌ని చంద్ర‌బాబు పలు మీటింగ్స్‌లో ఊద‌ర‌గోడుతున్నారు.అయితే ఇన్నాళ్లు బీజేపీ క‌లిసి ఉన్న చంద్ర‌బాబు క‌న్ను ఇప్పుడు కాంగ్రెస్‌పై ప‌డిన‌ట్లుంది.చంద్రబాబుకు ఏపీలో కొన్ని రకాల అజెండాలను అమలు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ కావాలి. ఇన్నాళ్లూ బీజేపీని అడ్డం పెట్టుకుని కొంత కథ నడిపించాడు. ఇప్పుడు లేటెస్ట్‌గా కాంగ్రెస్ పార్టీ అవ‌స‌రం ప‌డింది బాబుకి.అందుకే కాంగ్రెస్ పార్టీలో త‌న మ‌నిషి ఉంటే క‌థ న‌డిపించ‌డానికి సులువు అవుతుంద‌ని చంద్ర‌బాబు ఆలోచ‌న‌.ఈ నేపథ్యంలో పీసీసీకి కొత్త అధ్యక్షుడు రావాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నాడట. తమ అజెండాను వంద శాతం అమలు పెట్టగల సమర్థుడి కోసం చూస్తున్నాడట. ప్ర‌స్తుతం ఉన్న రఘువీరాకు చంద్ర‌బాబుకి అస‌లు ప‌డ‌దు.

దీంతో రఘువీరాను పీసీసీ ప‌ద‌వి నుండి తొల‌గించి త‌న మ‌నిషిని నియ‌మించాల‌ని చంద్ర‌బాబు ప్లాన్‌. దీనికి సంబంధించిన పనిని ఎల్లో మీడియాకు అప్ప‌గించిన‌ట్లు వార్తలు వ‌స్తున్నాయి. దీనిలో తెలుగుదేశం నాయ‌కులు ఎవ‌రు కూడా కాంగ్రెస్ పార్టీ మీద విమ‌ర్శ‌లు చేయ‌కూడ‌ద‌ని హూకుం జారీ చేశార‌ని స‌మాచారం.ఈ వార్త‌మానాన్నే కాంగ్రెస్ అధిష్ట‌నానికి పంపినట్లు తెలుస్తుంది.2019 ఎలెక్ష‌న్ల‌లో నా మ‌ద్ద‌తు మీకే ఉంటుంంద‌ని కాంగ్రెస్ పార్టీకి భ‌రోసా ఇచ్చార‌ని దానికి ప్ర‌తిఫ‌లంగా పీసీసీ అధ్య‌క్షుడిగా నేను చెప్పిన మ‌నిషిని నియ‌మించాల‌ని కోరిన‌ట్లు స‌మాచారం.మ‌రి దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి డెసిష‌న్ తీసుకుంటుదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -