Wednesday, May 8, 2024
- Advertisement -

IMDB టాప్ టెన్‌లో తెలుగు వారు ముగ్గురు

- Advertisement -

బాహుబ‌లి సినిమాతో మ‌రోసారి ప్ర‌ప‌చం సినీ ప‌రిశ్ర‌మ‌పై తెలుగు వారి స‌త్తా మ‌రోసారి నిరూపిత‌మైంది. ఇంట‌ర్నెట్ మూవీ డేటా బేస్ (IMDB)లో మ‌న తెలుగు వారు టాప్ టెన్‌లో ముగ్గురు నిలిచారు. అంతే కాకుండా ఆ జాబితాలో టాప్‌టెన్‌లో ఉన్న‌వారంద‌రూ మ‌న భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన‌వారే ఉండ‌డం గ‌మ‌నార్హం.

2017లో ప్రేక్షకులకు బాగా చేరువైన టాప్‌ 10 ఇండియన్‌ స్టార్స్‌ను ఐఎండీబీలో ఎంపిక చేశారు. ఈ జాబితాను శుక్రవారం (డిసెంబర్8న‌) విడుద‌ల చేశారు. ఈ జాబితాలో కింగ్‌ఖాన్ షారూక్ ఖాన్ నంబ‌ర్‌-1 స్థానంలో నిలిచాడు. ఆమిర్‌ఖాన్ రెండో స్థానంలో, మూడో స్థానంలో స‌ల్మాన్‌ఖాన్ నిలిచాడు.

ఇక నాలుగో స్థానంలో అవంతిక నిలిచింది. బాహుబ‌లిలో పచ్చ‌బొట్టేసిన అంటూ బాహుబ‌లితో స‌ర‌సాలు ఆడిన‌, బాహుబ‌లి ముగింపులో యుద్ధం చేసిన మిల్క్ బ్యూటీ త‌మ‌న్నా నాలుగో స్థానంలో నిలిచింది. అయితే ఈ సినిమాలో న‌టించిన ప్ర‌భాస్‌, అనుష్క వెన‌క్కు నెట్టి త‌మ‌న్నా నిల‌వ‌డం ఆశ్చ‌రం. ఇర్ఫాన్‌ఖాన్ త‌ర్వాత ఆరో స్థానంలో బాహుబ‌లి నిలిచాడు.

‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ సినిమాతో ఈ సంవత్సరం సినీ అభిమానుల్ని మెప్పించిన ప్ర‌భాస్ ఆరో స్థానానికి ప‌రిమిత‌మ‌య్యాడు. ఇక మొద‌టి సినిమా ర‌బ్ నే బ‌నాది జోడితో ఆక‌ట్టుకున్న ‘ఫిలౌరీ’ పిల్ల అనుష్క శ‌ర్మ ఏడో స్థానంలో నిలిచింది.

ఎనిమిదో స్థానంలో ‘దేవసేన’ అనుష్క నిలిచింది. వ‌రుస సినిమాలు చేస్తున్న స్విటీ ఈ జాబితాలో నిలిచింది. ప్ర‌స్తుతం అనుష్క భాగ‌మ‌తి సినిమాలో న‌టిస్తోంది. ఆ త‌ర్వాత స్థానాల్లో హృతిక్ రోష‌న్‌, ‘బార్బీడాల్‌’ కత్రినా కైఫ్ నిలిచింది.

ఈ విధంగా IMDB జాబితాలో మ‌న తెలుగు సినిమా స‌త్తానే కాకుండా భార‌తీయ సినిమా స‌త్తా చాటింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -