Monday, May 6, 2024
- Advertisement -

ఎన్టీఆర్ బయోపిక్‌లో త‌మ‌న్నా ఎవరి పాత్ర చేస్తుందో తెలుసా?

- Advertisement -

నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ‌ను ఎన్టీఆర్ పేరుతో సినిమాగా తెర‌కెక్కిస్తున్నాడు ఆయ‌న త‌న‌యుడు బాల‌కృష్ణ‌. ఈ బ‌యోపిక్ క్రిష్ చేతుల‌లోకి వెళ్లిన ద‌గ్గ‌ర నుంచి సినిమాపై అంచ‌నాలు భారీగా ఏర్ప‌డ్డాయి. తాజాగా సినిమాలో ర‌కుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ బ‌యోపిక్‌లో శ్రీదేవి పాత్ర‌లో క‌నిపిస్తుంది ర‌కుల్‌. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుద‌ల చేశారు. అయితే ఈ సినిమాలో మ‌రో స్టార్ హీరోయిన్‌ని కూడా తీసుకున్నార‌ట‌.

మిల్కీ బ్యూటీ త‌మన్నాను సినిమాలో ఓ కీల‌క పాత్ర కోసం తీసుకున్నాడు క్రిష్‌. జయప్రద పాత్రలో తమన్నా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్, జయప్రద కాంబినేషన్ లో యమగోల, అడవిరాముడు వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. దీనితో జయప్రద పాత్రకు తమన్నా సరిపోతుందనే ఉద్దేశంతో ఆమెని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు పాత్రలో రానాని, ఏఎన్నార్ పాత్రలో సుమంత్‌ని అద్భుతంగా చూపించబోతున్నాడు క్రిష్‌. ఇక సినిమాను రెండు భాగాలుగా విడుద‌ల చేయ‌నున్నారు.జ‌న‌వ‌రికి సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -