Saturday, April 20, 2024
- Advertisement -

మ‌రో సారి వీర‌నారి పాత్ర‌లో త‌మ‌న్నా..

- Advertisement -

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా ‘సైరా’ షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఈ సినిమాలో కథానాయికగా నయనతార నటిస్తున్న సంగ‌తి తెలిసిందే. నయనతార కాంబినేషన్లోని కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. ఈ సినిమాలో తమన్నా కూడా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి.

ప్ర‌స్తుతం మిల్కీ బ్యూటీ తమన్నాకు ఈ మధ్య పెద్దగా అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘నా నువ్వె’ సినిమా మాత్రమే ఉంది. ఈ తరుణంలో ఆమెకు చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలిసింది. అయితే, ఆమెది ప్రాధాన్యం ఉన్న పాత్ర కాదని, ఈ సినిమాలో ఆమె ఐటెమ్ సాంగ్‌కే పరిమితం కానుందనే వార్తలు వస్తున్నాయి.

అయితే ‘సైరా’ లో త‌మ‌న్నాను ఐట‌మ్ పాత్ర కాకుండా నరసింహా రెడ్డి తరఫున శత్రువులపై పోరాడే వీరనారిగా కనిపించనుందని చిత్ర యూనిట్ అంటున్నారు . ఇందులో ఆమెది ‘బాహుబలి’లోని అవంతికలా వీర వనిత పాత్రను పోలి ఉంటుందని చెప్పారు. ఉయ్యలవాడ నరసింహారెడ్డి కోసం తన జీవితాన్ని త్యాజించే మహిళగా కనిపించనుందని తెలిపారు. ఇక మరో ముఖ్యమైన పాత్ర కోసం ప్రగ్యా జైస్వాల్ పేరు కూడా వినిపిస్తోంది.

సురెందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్‌తో పాటు జగపతి బాబు, నయనతార, విజయ్ సేతుపతి తదితరులు నటిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -