చిరంజీవి మరో సారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇండస్ట్రీలో ఆర్థిక కష్టాల్లో ఉన్నా వారిని ఆదుకోవడం తెలిసిందే. తాజాగా కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటాలీవుడ్ సీనియర్ నటి సుభాషిణికి అగ్రహీరో చిరంజీవి సాయం అందించారు.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుభాషిని వైద్యం చేయించుకునేందుకు కూడా డబ్బు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. విషయం చిరంజీవి దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. ఆమె కష్టాల గురించి తెలుసుకొని చలించిపోయి చిరు రూ. 2 లక్షల ఆర్థిక సాయం చేశారు.
సుభాషిణి ఇంటికి చిరంజీవి చిన్నకూతురు శ్రీజ ఈరోజు వెళ్లారు. ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుకున్న శ్రీజ, రూ.2 లక్షలు అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
కష్గాల్లో ఉన్న తనకు సాయాన్ని అందించిన చిరంజీవికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. సుభాషిణి ఎన్నో సినిమాల్లో కమెడియన్గా అలరించారు. అల్లరి, కితకితలు, అమ్మాయిలు అబ్బాయిలు సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగు మాత్రమే కాదు… తమిళం, కన్నడ, మళయాళంలో కూడా నటించారు.
