Monday, April 29, 2024
- Advertisement -

ఆ హీరోతో డేటింగ్ చేయాల‌ని ఉంది – త‌మ‌న్నా

- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త‌మ‌న్నా గురించి కొత్త ఇప్పుడు చెప్ప‌డానికి ఏముంది. అందం , అభిన‌యం రెండు ఆమె సొంతం. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ భాష‌ల‌లో కూడా సినిమాలు చేసింది. తాజాగా ఈ భామ ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్య్వూలో త‌న సినిమాల‌తో పాటు , వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను కూడా అభిమానుల‌తో పంచుకుంది. మీరు ఎవరితో డేటింగ్ వెళ్లాల‌ని ఉంద‌ని యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు క్రేజీ అన్స‌ర్ ఇచ్చింది. డేటింగ్ వెళ్లే పేరు చెప్ప‌మంటే ఎవ‌రు ఊహించ‌ని హీరో పేరు చెప్పి షాకిచ్చింది. ఇంత‌కి త‌మ‌న్నా ఏ హీరో చెప్పిందో తెలుసా..? విక్కీ కౌశల్ పేరు చెప్పింది. బాలీవుడ్‌లో ఇటీవ‌ల కాలంలో బాగా వినిపిస్తున్న పేరు ఇది. ‘ఉరి: సర్జికల్ స్ట్రైక్స్ సినిమాతో విక్కీ కౌశల్ క్రేజ్ బాగా పెరిగింది.

తన నటనతో అందరినీ ఆకట్టుకున్న ఈ నటుడికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. అత‌ని గురించి త‌మ‌న్నా మాట్లాడుతు సర్జికల్ స్ట్రైక్స్ అత‌ని న‌ట‌న‌కు ఫిదా అయ్యాన‌ని తెలిపింది. డేటింగ్ వెళ్లాల్సి వ‌స్తే క‌నుక అత‌నితోనే వెళ్తాన‌ని చెప్పింది త‌మ‌న్నా. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే త‌మ‌న్నాకు తెలుగు ప్ర‌స్తుతం ఒక్క సినిమా కూడా లేక‌పోయిన‌ప్ప‌టికి , త‌మిళంలో మాత్రం రెండు సినిమాల్లో న‌టిస్తుంది. విశాల్ హీరోగా సుంద‌ర్ .సి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమాలో త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. ‘దేవి 2’, ‘దటీజ్ మహాలక్ష్మి’ వంటి సినిమాలు విడుద‌ల కావాల్సి ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -