- Advertisement -

క‌డ‌ప కొత్త ఎస్పీగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న అభిషేక్ మ‌హంతి..

- Advertisement -

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏపీలో అధికారుల బ‌దిలీల ప్ర‌క్రియ ప్రాముఖ్య‌త‌ను సంత‌రించుకుంది. ఇంటెలిజెన్స్ ఛీఫ్‌, క‌డ‌ప‌, శ్రీకాకులం జిల్లాల ఎస్పీ అధికారులు అధికారా పార్టీకి అనుకూలంగా ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేస్తున్నార‌ని వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేయ‌డంతో వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుంది. ఐబీ ఛీఫ్ ఏబీ వెంక‌టేశ్వ‌రరావు, క‌డ‌ప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్‌, శ్రీకాకులం ఎస్పీ వెంక‌ట‌ర‌త‌న్నంల‌ను ఎన్నిక‌ల విధుల‌నుంచి తొల‌గిస్తూ నిర్న‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. క‌డ‌ప కొత్త ఎస్పీగా అభిషేక్ మహంతిని నియమిస్తూ, నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది ఈసీ. రాహుల్ దేవ్ డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేసిన వెంటనే ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2012 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన అభిషేక్ మహంతికి గతంలో కడప జిల్లాలో పని చేసిన అనుభవముంది. గత సంవత్సరం నవంబర్ 2న జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆయన, ఫిబ్రవరి 14 వరకూ పనిచేసి, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ గా బదలీ అయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -