Saturday, May 18, 2024
- Advertisement -

కొవ్వు క‌రిగించుకుంటున్న మిల్కీబ్యూటీ

- Advertisement -
సినిమాలు లేక‌పోవ‌డంతో కొంచెం బొద్దుగా మారిన త‌మ‌న్నా.. ఇప్పుడు కొవ్వు క‌రిగించుకోవ‌డానికి పాట్లు ప‌డుతోంది. ఆ మ‌ధ్య జై ల‌వ‌కుశ‌లో ఎన్టీఆర్‌తో క‌లిసి స్వింగ్ జ‌ర స్వింగ్ జ‌ర అంటూ ఐట‌మ్ పాట‌లో మెరిసింది. హాట్‌హాట్‌గా క‌నిపించి క‌నుసైగ‌ల‌తో క‌వ్వించి ప‌డేసింది. ఇప్పుడు ఆ అమ్మడు అవ‌కాశాల కోసమో.. లేక సినిమా అవ‌కాశం వ‌చ్చిందో కానీ క‌ష్ట‌ప‌డుతోంది.
 
స‌న్న‌గా అయ్యేందుకు తమన్నా తీవ్రంగా కృషి చేస్తోందిన ఫొటోలు చూస్తుంటే తెలుస్తోంది. మళ్లీ ఫుల్ ఫాంలోకి వచ్చేందుకు గట్టిగా ట్రై చేస్తోంది. నడుం వయ్యారాలకు బాగా గుర్తింపు పొందిన ఈ హీరోయిన్ ప్రస్తుతం స‌న్న‌బ‌డ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తోంది.  ఆ ప్ర‌య‌త్నంలో భాగంగా యోగా సాధ‌న చేస్తోంది. యోగా చేసి పెరిగిన బరువును కరిగించ‌డానికి తంటాలు ప‌డుతోంది. ప్రతీ రోజూ ఒక కొత్త ఆసనం నేర్చుకుంటున్నానని.. యోగా కంటే బెటర్ మరేదీ లేదని మైండ్-బాడీ సమైక్యం అవుతాయని యోగ గురించి  తమన్నా చెప్పేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -