Wednesday, May 8, 2024
- Advertisement -

థ‌ర్డ్ ఫ్రంట్‌కు మ‌రో అడుగు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్ర‌కాశ్‌రాజ్ బాస‌ట‌

- Advertisement -

దేశ రాజ‌కీయాల్లో గుణాత్మ‌క మార్పు రావాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ అధినేత కే.చంద్ర‌శేఖ‌ర్‌రావు ఆకాంక్షిస్తున్నారు. అందులో భాగంగా స‌మాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాల స‌హ‌కారంతో కేంద్ర ప్ర‌భుత్వం ప‌ని చేయాల‌ని చెబుతున్నారు. ఆ విధంగా ప్ర‌స్తుతం దేశంలో ఉన్న రెండు ప్ర‌ధాన జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అవ‌లంభించ‌డం లేద‌ని ఆరోపిస్తూ తాను థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. అప్ప‌టి నుంచి ఆ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా దేశంలో ప‌ర్య‌టిస్తున్నారు. ఇటీవ‌ల ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీని క‌ల‌క‌త్తా వెళ్లి క‌లిసిరాగా నిన్న జార్ఖండ్ మాజీ ముఖ్య‌మంత్రి వ‌చ్చి కేసీఆర్‌ను క‌లిశారు. థ‌ర్డ్ ఫ్రంట్‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

ఇప్పుడు ఈ జాబితాలో సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ చేరిన‌ట్టు తెలుస్తోంది. గురువారం (మార్చి 29) సీఎం కేసీఆర్‌తో కలిసి తెలంగాణ అసెంబ్లీకి ప్రకాశ్‌రాజ్ వచ్చారు. మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో కలిసి ప్రకాశ్‌రాజ్ భోజనం చేశారు. ఈ భేటీ వెనుక రాజకీయ నేపథ్యం ఉంద‌ని తెలుస్తోంది. ఎందుకంటే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని, బీజేపీని ప్ర‌కాశ్‌రాజ్ తీవ్రంగా విమ‌ర్శిస్తున్నాడు.

ఇటీవ‌ల ఫెడరల్ ఫ్రంట్ అని కేసీఆర్ చెప్ప‌డంతో ప్రకాశ్‌రాజ్‌తో ఆక‌ర్షితులైన‌ట్టు తెలుస్తోంది. గౌరీలంకేశ్ హత్య నుంచి ప్రధానిపై, బీజేపీ నాయ‌కులపై ప్రకాశ్ రాజ్ విమర్శలు సంధిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్రకాశ్‌రాజ్‌ను త‌న ఫెడరల్ ఫ్రంట్‌లో భాగస్వామిని చేసుకోవాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఉన్న‌ట్లు స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -