Thursday, April 25, 2024
- Advertisement -

‘ఆర్ఆర్ఆర్’ ఆ పేరు ఎలా వచ్చిందంటే..?

- Advertisement -

ఎక్కడ చూసినా ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ మానియానే. ఈ సినిమా విడుదలకు ముందే అనేక సంచలనాలను నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామచరణ్ క్రేజీ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఆలియాభట్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాపై మొదటి నుంచీ సామాజిక మాధ్యమాల్లో చర్చలే.

అయితే ఈ సినిమాకు ఆర్ఆర్ఆర్ పేరు ఎలా ఖరారు చేశారు ? ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి ఇటీవలే వెల్లడించారు. వాస్తవానికి ఈ సినిమా ప్రకటించినప్పుడు.. ఏ పేరు పెట్టాలన్న దానిపై ఫిక్స్ కాలేదు. కేవలం ప్రాజెక్టు పేరుగానే ఆర్ఆర్ఆర్ ని అనుకున్నారు. రాజమౌళి, రామ్ చరణ్, రామారావు పేర్లలో మొదటి అక్షరాలతో ఆర్ఆర్ఆర్ కూర్చారు. కొన్ని రోజుల తర్వాత సినిమా పేరు ప్రకటిస్తామని చెప్పినా… ఆర్ఆర్ఆరే బాగా పాపులర్ అయ్యింది. దాంతో సినిమాకు ఆర్ఆర్ఆర్ అంటే తెలుగులో రౌద్రం, రణం, రుధిరం అని అర్థం వచ్చేలా పేరు పెట్టారు.

హిందీ, ఇంగ్లీష్లో అయితే రైజ్, రోర్, రివోల్డ్ అని కూర్చారు. అయితే ఈ సినిమాకు పేరు ఎలా వచ్చిందనే విషయాన్ని రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. గతంలో కపిల్ శర్మ షోకు వెళ్లినప్పుడు కూడా ఇదే విషయాన్ని బయటపెట్టారు. తొలుత ప్రాజెక్టు పేరుగా ఆర్ఆర్ఆర్ ను అనుకున్నామనీ.. కానీ అదే పేరుతో సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ కావడంతో.., ఇదే పేరు బాగుందని చాలా మంది అభిమానులు చెప్పడంతో దాన్నే ఖరారు చేశామన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -