Friday, March 29, 2024
- Advertisement -

కోలీవుడ్ కమెడియన్ కి సీరియస్.. ఐసీయూలో చికిత్స!

- Advertisement -

ప్రముఖ తమిళ నటుడు వివేక్ కి హఠాత్తుగా గుండెపోటుకు గురి కావడం పరిస్థితి విషమంగా ఉండడంతో శుక్రవారం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఐసియులో చికిత్స పొందుతున్న వివేక్ గురువారమే కోవిడ్ కి వాక్సిన్ కూడా తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌లో ఉంచి వైద్యం అందిస్తున్నట్లు సిమ్స్ వైద్యులు తెలిపారు. అలాగే వివేక్‌కు యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 59 ఏళ్ల వివేక్ గురువారం నాడు కోవిడ్ 19 వ్యాక్సిన్ డోస్ తీసుకున్నారు.

అనంతరం క్షేమంగా బయటకు వచ్చిన వివేక్.. కరోనా నుంచి సురక్షితంగా ఉండేందుకు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలందరికీ పిలుపునిచ్చారు. కోవాక్సిన్ తో పాటు కోవీషీల్డ్ కూడా మనకు కోవిడ్ రాకుండా చేయలేనప్పటికీ… కోవిడ్ ప్రమాదస్థాయిని తగ్గిస్తాయని అన్నారు వివేక్. మాస్క్‌లు ధరించడం, చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం.

టీకా వేసుకోవడం ముఖ్యం అని ప్రకటించారు. ఇంతలోనే ఆయనకు హార్ట్ అటాక్ రావడం అందరినీ షాక్‌కు గురి చేస్తుంది. తనదైన కామెడీతో తమిళ ప్రేక్షకుల మనసు దోచారు. తమిళంలోనే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా వివేక్ సుపరిచితులే.. తెలుగులో విడుదలైన సింగం, యముడు వంటి సినిమాల్లోనూ పోలీసు పాత్రలో ప్రేక్షకులను అలరించాడు.

పెళ్లి చేసుకొని మోసం చేశాడు.. ఎస్సైపై కేసు పెట్టిన సినీనటి!

సర్పదోషం ఉందని.. కన్నకూతురు గొంతుకోసిన కన్నతల్లి!

మాజీ శాసనసభ్యుడు మృతి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -