Friday, May 17, 2024
- Advertisement -

తాను రీల్ హీరో కాదు..రీయ‌ల్ హీరో అనిపించుకున్న సూర్య‌

- Advertisement -

సినిమా హీరోలో రీల్ జీవితంలోనే సేవ‌లు ,సాయం వంటి మాటాలు చెబుతుంటారు.కాని ప్ర‌స్తుతం ఉన్న జ‌న‌రేష‌న్‌లో ఉన్న హీరోలు తాము రీల్ హీరోల‌మే కాదు ,రీయ‌ల్ హీరోలం అని నిరుపించుకుంటున్నారు.త‌మ అభిమానులు క‌ష్ట‌ల‌లో ఉంటే వెళ్లి వారికి అండ‌గా నిలుస్తున్నారు.తాజాగా అలాంటి సంఘ‌ట‌నే ఒక‌టి త‌మిళ హీరో సూర్య చేసి చూపించారు.తన ట్రస్ట్ ద్వారా చాలామంది పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తోన్న సూర్య, అనారోగ్యంతో బాధపడుతోన్న పిల్లలకు కూడా సాయాన్ని అందిస్తూ ఉంటారు.

అరుదైన వ్యాధితో బాధపడుతోన్న దినేశ్ అనే బాలుడికి తన అభిమాన హీరో సూర్యను చూడాలనిపించిందట. ఈ విషయం తెలుసుకున్న సూర్య .. ఆ పిల్లాడిని తన ఇంటికి పిలిపించుకుని సరదాగా గడిపారు. ఆ పిల్లాడికి కొన్ని కానుకలను అందజేయడమే కాకుండా .. సెల్ఫీలు కూడా తీసుకుని అతణ్ణి ఉత్సాహపరిచారు. అంతే కాకుండా ఆ పిల్లవాడి వైద్యానికి ఎంత ఖర్చు అయినా తాను భరిస్తానని హామీ ఇచ్చారట.సూర్య మంచి మ‌న‌స్సును ప్ర‌తి ఒక్క‌రు అభినందిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -