- Advertisement -
2018 మిస్ ఇండియా పోటీలు మంగళవారం సాయంత్రం ముగిశాయి.మిస్ ఇండియా 2018 విజేత పేరు మంగళవారం అర్థరాత్రి తర్వాత ప్రకటించారు. ముంబయిలో జరిగిన ఈ పోటీలలో మిస్ వరల్డ్ మానుషీ .. మిస్ ఇండియా 2018 విజేత పేరు ప్రకటించారు. తమిళనాడుకు చెందిన అనుకృతివాస్ మిస్ ఇండియా 2018 విజేతగా నిలిచింది. ఈ పోటీలో రెండో రన్నరప్ గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన శ్రేయ నిలిచారు.
తాజా మిస్ ఇండియా 2018 విషయానికి వస్తే సింగిల్ మదర్ ఛైల్డ్ గా అనుకృతి ప్రస్తుతం బీఏ ఫ్రెంచ్ చేస్తోంది. 19 ఏళ్ల ఈ ముద్దుగుమ్మకు వీలైనన్ని ఎక్కువ భాషలు నేర్చుకోవాలన్న కోరిక ఎక్కువట. మిస్ ఇండియా టైటిల్ గెలవడంలో మా అమ్మాగారు సలహాలు చాలా ఉపయోగపడ్డాయి అని తెలిపింది.ఇక సినిమాలలో అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తానని చెప్పుకొచ్చింది.