Thursday, May 2, 2024
- Advertisement -

విజయ్ కూడా మారిపోయాడా?

- Advertisement -

యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్నాడు. అయితే ఈ సినిమా నిర్మాణాంతర పనులు జరుగుతున్నప్పుడు మీడియా లో సినిమా గురించి అనేక వార్తలు వచ్చాయి. ఈ సినిమా కి సంబంధించి దర్శకుడికి విజయ్ కి పొసగలేదని, ఇద్దరికీ భిన్నాభిప్రాయాలు ఉండేవని, అందువలనే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సమయం లో విజయ్ వేలు పెడుతూ ఉండటం నచ్చక సినిమా దర్శకుడు తప్పుకుంటే, విజయ్ మొత్తం దగ్గరుండి చూసుకున్నాడని టాక్ నడిచింది.

ఈ రూమర్స్ అన్నీ విన్న టీమ్ సైలెంట్ గా నే ఉండిపోయింది. అయితే మీడియా లో రిపోర్ట్ అయినంత కాకపోయినా నిజానికి వారి ఇద్దరికీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయని కొంత మంది ఇండస్ట్రీ లో మాట్లాడుకుంటున్నారు.

అయితే ఇప్పుడు ఫిలిం నగర్ లో తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం విజయ్ దేవరకొండ సినిమాల విషయం లో పూర్తి గా మారిపోయాడట. సినిమాల మేకింగ్ విషయం లో తన అభిప్రాయం నెగ్గాలి అని దర్శకుడి పని లో కూడా దొరుతున్నాడని టాక్ నడుస్తుంది. విజయ్ తన కెరీర్ ఆరంభం లో ఇలా ఎప్పుడూ చేయలేదు కానీ ఇప్పుడు ఇలా చేస్తున్నాడు అని రూమర్స్ వస్తున్నాయి అంటే, కచ్చితంగా సక్సెస్ విజయ్ నెత్తికి ఎక్కింది అని విమర్శకులు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -