Monday, May 13, 2024
- Advertisement -

హరితేజ ఘటనపై స్పందించిన తమ్మారెడ్డి!

- Advertisement -

ఓ సినిమా థియేటరులో తనకు ఎదురైన అనుభవాన్ని నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ హరితేజ కన్నీరు పెట్టుకుంటూ చెప్పుకుంది.ఇటీవల ‘మహానటి’ సినిమా చూసేందుకు తన తండ్రి, తల్లి, చెల్లెలుతో కలసి హరితేజ వెళ్లింది.విశ్రాంతి తరువాత, సీట్లు మారాల‌ని అనుకున్న హ‌రితేజ త‌న త‌ల్లి ప‌క్క‌న ఉన్న సీట్లో కుర్చోవ‌ల‌ని అనుకుంది.దీంతో సీటు మార‌ల‌ని త‌న ప‌క్క‌న ఆమెను అడిగింది.

దీంతో ఆమె మా కుతురు అక్క‌డ కుర్చోద‌ని ,హ‌రితేజ‌తో గొడ‌వ‌కు దిగింది. తన కుమార్తె హరితేజ తండ్రి పక్కన కూర్చోదని వాదించిన ఓ ప్రేక్షకురాలు, మీ నాన్న పక్కన కూర్చోడానికి తన కుమార్తె ఇబ్బంది పడుతోందని, మగాళ్ల పక్కన కూర్చోడానికి తామేమీ సినిమా వాళ్లం కాదని గట్టిగానే చెప్పింది.ఈ మాటలతో హర్ట్ అయిన హరితేజ, తాను ఎదుర్కొన్న ఘటనపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. తాజాగా దీనిపై తమ్మారెడ్డి భరధ్వాజ స్పందించారు.

సదరు ప్రేక్షకురాలేమైనా పతివ్రత అన్న సర్టిఫికెట్ తో థియేటర్ కు వచ్చిందా? అని ప్రశ్నించారు. తన మాటలు బాధపెడితే క్షమించాలని అంటూనే, సినిమావాళ్లను చిన్న చూపుచూడవద్దని, వారూ మామూలు మనుషులేనని, తాము ప్రేక్షకులను దేవుళ్లుగా చూస్తామని కాని మీరు మాత్రం మ‌మ్మ‌ల్ని చిన్న చూపు చూస్తున్నార‌ని ఆయ‌న వీడియోలో తెలిపారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -