Saturday, May 4, 2024
- Advertisement -

ర‌వితేజ‌: నేల టికెట్టు రివ్యూ

- Advertisement -

‘సోగ్గాడే చిన్ని నాయన’.’రా రండోయ్ వేడుక చూద్దాం’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కొంత గ్యాప్ తీసుకొని రవితేజ హీరోగా పక్కా కమర్షియల్ మాస్ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్ ను ఎంతవరకు ఆకట్టుకుందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ : ఆదిత్య భూపతి (జగపతి బాబు).. తండ్రి ఆనంద భూపతి (శరత్‌ బాబు) వారసుడిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టి హోం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల పేరుతో తండ్రి ఆస్తిని దానం చేసేస్తున్నాడని ఆనంద భూపతిని చంపించేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న జర్నలిస్ట్‌ గౌతమి మీద హత్యా ప్రయత్నం చేస్తాడు. అధికారం అడ్డుపెట్టుకోని ఉద్యోగాలు అమ్ముకోవటం, కబ్జాలు, దందాలు చేస్తూ వేల కోట్ల ఆస్తులు సంపాదిస్తాడు. ఈ కథలో హీరో అనాథ(రవితేజ). అమ్మానాన్న తో పాటు కనీసం పేరు కూడా లేని హీరోని చేరదీసిన వ్యక్తి థియేటర్‌లో నేల టిక్కెట్టులో పడుకోబెడతాడు. అప్పటి నుంచి అదే హీరో ఇల్లు, పేరు అవుతుంది. నేల టిక్కెట్టు పేరుతోనే పెరిగి పెద్దవాడైన హీరో. తనను అన్నా.. తమ్ముడు అని పిలిచిన ప్రతీ వారికి కాదనకుండా సాయం చేస్తుంటాడు. కోర్టులో దొంగ సాక్ష్యాలు చెప్పే హీరో ఓ కేసు కారణంగా ఫ్రెండ్స్‌తో సహా వైజాగ్‌ వదిలి వెళ్లిపోవాల్సి వస్తుంది.ఆదిత్య భూపతి అవినీతిని, దుర్మార్గాలను ఎలా బయటపెట్టాడు..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :రవితేజకు ఈ సినిమా ఏ రకంగానూ ప్రత్యేకమైన సినిమా కాదు. రవితేజకు తనకు అలావాటైన ఎనర్జిటిక్‌ పర్ఫామెన్స్‌ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే గతంలో రవితేజ చేసిన తరహా రొటిన్‌ సీన్స్ లో కనిపించటంతో కొత్తదనమేమీ కనిపించదు. పైగా అతడి లుక్ తేడాగా ఉండి.. కనిపించిన ప్రతిసారీ ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది. సాధారణ సన్నివేశాలైనా కానీ కామెడీసీన్లనే సరికి రవితేజ తనదైన శైలిలో నిలబెట్టేస్తాడు. కానీ ద్వితియార్ధంలో అతని క్యారెక్టర్‌ని సీరియస్‌గా మార్చేయడంతో కనీసం కామెడీతో అయినా రవితేజ దీనిని కాపాడే అవకాశంలేకుండా చేశారు. అంటే రవితేజ పవర్‌ఫుల్‌ సీన్లు పండించలేడని కాదు. హీరోయిన్ మాళవిక శర్మ తెరపై అందంగా కనిపించింది. కానీ నటన పరంగా పెద్దగా ఆకట్టుకోదు. బ్రహ్మానందం, అలీ, పోసాని, పృధ్వీ వంటి కమెడియన్లను సరిగ్గా వినియోగించుకోలేకపోయారు. జగపతి బాబు నటన పరంగా ఆకట్టుకున్నా.. అతడి పాత్రను మరింత బలంగా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది.

కథనం-విశ్లేషణ:సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్‌ వేడుక చూద్దాం లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లను తెరకెక్కించిన కల్యాణ్‌ కృష్ణ, మూడో ప్రయత్నంగా మాస్‌ హీరోతో ఓ కమర్షియల్‌ కథను ఎంచుకున్నాడు. ఫస్ట్‌హాఫ్ అంతా అసలు కథను మొదలు పెట్టకుండా సరదా సన్నివేశాలతో లాగేయటం, ఆ సన్నివేశాల్లో రవితేజ మార్క్‌ కామెడీని పండించలేకపోవటంతో ఆడియన్స్‌ను ఇబ‍్బంది పెడుతుంది. సెకండ్‌ హాఫ్‌లో అసలు కథ మొదలైనా కథనంలో వేగం లేకపోవటం నిరాశపరుస్తుంది ఫిదా సినిమా విజయంలో తన వంతు పాత్ర పోషించిన సంగీత దర్శకుడు శక్తికాంత్‌ కార్తీక్‌, నేల టిక్కెట్టుతో మెప్పించలేక పోయాడు. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి నిర్మాణ విలువలు బాగున్నాయి.

సాంకేతికవర్గం:పాటలు ఆకట్టుకోలేదు కానీ నేపథ్య సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపిస్తుంది. స్టోరీ, స్క్రీన్‌ప్లే పరంగా అవుట్‌డేటెడ్‌ ఫార్మాట్‌లో వున్న ఈ సినిమా టెక్నికల్‌గా, టేకింగ్‌ పరంగా కూడా పాత పద్ధతులనే అవలంబించడం వల్ల కొత్తదనం అనేది మాట వరసకి కూడా లేకుండా పోయింది. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. యాక్షన్ సీన్స్ పెద్దగా ఆకట్టుకోవు. ఇంటర్వెల్ కు ముందు ప్లాన్ చేసిన భారీ యాక్షన్ సీన్ కూడా తెరపై పండలేదు.

బోట‌మ్ లైన్ :మొత్త‌నికి నేల‌ నాకించిన ర‌వితేజ‌

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -