Sunday, May 5, 2024
- Advertisement -

నానా పటేకర్ అస‌భ్య‌క‌ర వీడియోలు బ‌య‌ట‌పెట్టే ప‌నిలో తనుశ్రీ దత్తా

- Advertisement -

తనుశ్రీ దత్తా బాలీవుడ్‌ను షేక్ చేస్తుంది.బాలీవుడ్‌లో అప్ప‌ట్లో కొన్ని సినిమాలు చేసిన త‌ను శ్రీ ద‌త్తా త‌రువాత కాలంలో పెళ్లి చేసుకుని వేరే దేశంలో స్థిర ప‌డింది.ఏమైంది ఏమో కాని స‌డ‌న్‌గా ఇండియాకు తిరిగి వచ్చి బాలీవుడ్ లెంజెండ‌రీ యాక్ట‌ర్ నానా ప‌టేక‌ర్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని తనుశ్రీ చేసిన ఆరోపణలు ఇప్పుడు బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

ఇప్పుడు తను చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించడానికి రెడీ అవుతుంది. దానికి సంబంధించిన వీడియోని ఆమె మీడియా ముందు పెట్టబోతుందని బాలీవుడ్ వర్గాల సమాచారం.ఆ వీడియోలో తనతో నానా పటేకర్ అసభ్యకరంగా ప్రవర్తించిన దృశ్యాలు ఉన్నాయంటూ తనుశ్రీ దత్తా సన్నిహితులు చెబుతున్నారు. మేకింగ్ వీడియోలలోనే నానా పటేకర్ బాగోతమంతా రికార్డ్ అయిందని తెలుస్తుంది.ఇంత‌కి ఆ వీడియోలో ఏముందో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -