Thursday, May 2, 2024
- Advertisement -

నాకు ఇంకా ఆ అనుభ‌వం ఎదురుకాలేదు : తాప్సీ

- Advertisement -

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు అన్ని ఇండ‌స్ట్రీలను కుదిపేసింది కాస్టింగ్ కౌచ్.శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై పోరాటం మొదలుపెట్టిన దగ్గర నుండి ఈ వివాదం మరింత రాజుకుంది. మీడియా ముందుకొస్తోన్న ప్రతి హీరోయిన్ కి ఈ కాస్టింగ్ కౌచ్ కి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కొందరు బోల్డ్ గా స్పందిస్తుంటే మరికొందరు మాత్రం తమకు కాస్టింగ్ కౌచ్ ఎదురుకాలేదని చెబుతున్నారు.తాజాగా ఈ కాస్టింగ్ కౌచ్‌పై స్పందించారు హీరోయిన్ తాప్సీ.కాస్టింగ్ కౌచ్ ఎదురుకాకపోవడం తన దురదృష్టమని చెబుతోంది.

”అదృష్టమో, దురదృష్టమో కానీ నాకు కాస్టింగ్ కౌచ్ అనుభవాలు లేవు. దురదృష్టమని ఎందుకంటున్నానంటే.. నాకు కూడా అలాంటి అనుభవాలు ఎదురై ఉంటే అప్పుడు ఈ విషయంపై చాలా బాగా మాట్లాడేదాన్ని. ‘పింక్’ సినిమా విడుదలైన తరువాత నేను మహిళా సమస్యలపై మాట్లాడతానని చాలా మంది ఎదురుచూస్తున్నారు. కాబట్టి కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడితే బాగుండేది.నాకు అది అనుభవం లేని విషయం. మొదటి నుండి కూడా నేను పెద్ద బ్యానర్లు, పెద్ద దర్శకులతో సినిమాలు చేశాను. అలానే కెరీర్ కంటిన్యుడూ అయింది. దీంతో నాతో అసభ్యకరంగా ప్రవర్తించడానికి ఎవరూ ధైర్యం చేయ‌లేక‌పోయారంటూ చెప్పుకొచ్చింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -