Saturday, May 4, 2024
- Advertisement -

మా కుటుంబంలో అందరం కలుస్తాం

- Advertisement -

నందమూరి బాలయ్య బాబు సినిమాలో చిన్న పాత్ర ఇచ్చినా చేసేందుకు తాను సిద్ధమని నందమూరి తారకరత్న చెబుతున్నాడు. బాలయ్య వందో సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రంలో తనకు చిన్న పాత్ర ఉందని అంటున్నారని, అయితే బాబాయ్ మాత్రం ఇంకా ఆ విషయాన్ని ఎక్కడా చెప్పలేదని, అందులో ఎంత చిన్న పాత్ర ఉన్నా చేయడానికి తాను సిద్ధమని తారకరత్న చెప్పాడు.

నారా రోహిత్ హీరోగా తారకరత్న విలన్ గా రాజా చేయ్యి వేస్తే చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా తారకరత్న మీడియాతో మాట్లాడుతూ నందమూరి కుటుంబ సభ్యులు కలిసికట్టుగా కనిపించకపోయినా తామంతా ఎవరో ఒకరి ఇంట్లో కలుస్తూనే ఉంటామని అన్నారు. సమయం వచ్చినప్పుడల్లా నేను, ఎన్టీఆర్, కల్యాణరామ్ కలుసుకుంటూనే ఉంటామని,  ఆ సమయంలో ఎంతో సరదాగా గడుపుతామని చెప్పాడు.

ఇంతకు ముందు తాను విలన్ గా చేసిన అమరావతి చిత్రానికి తనకు నంది అవార్డు వచ్చిందని, పాత్ర ఏదైనా అందులో లీనమై చేయాలని తారకరత్న అన్నాడు. అమరావతి చిత్రం క్రెడిట్ ఆ చిత్ర దర్శకుడు రవిబాబుకే దక్కుతుందని చెప్పాడు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -