Thursday, May 16, 2024
- Advertisement -

చొరబడుతున్న డ్రాగన్

- Advertisement -

భారత్ లో  భూ, జల మార్గాల ద్వారా చొరబడి దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని చైనా ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఇందుకోసం ఎక్కడ వీలైతే అక్కడ చోరబాటుకు ప్రయత్నిస్తోంది.

డ్రాగన్ చేస్తున్న ఈ ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు భారత్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. చైనా తన కుట్రలో భాగంగా భారత మిత్ర దేశాలైన శ్రీలంక, నేపాల్ లను తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది. భారత్ కు అత్యంత సన్నిహితమైన శ్రీలంకను తమ వైపు తిప్పుకుని భారత్ ను దెబ్బతీయాలనేది చైనా కుతంత్రం. ఇందులో భాగంగా శ్రీలంకతో రక్షణ, ఆర్ధిక సంబంధాలను చైనా మరింత పటిష్టం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అలాగే మరో హిందు దేశమైన నేపాల్ తో కూడా తమ సంబంధాలను మెరుగుపరచుకుని భారత్ ను ఏకాకి చేయాలన్నదని చైనా వ్యూహంలా కనిపిస్తోంది.

ఇందుకోసం నేపాల్ లో భారత సంతతి వారైన మాధేసీలకు వ్యతిరేకంగా రాజ్యాంగ రచన చేయడం వెనుక చైనా పాత్ర ఉందని అనుమానాలు వస్తున్నాయి. మాధేసిల డిమాండ్లపై భారత్ అనధికారికంగా నేపాల్ పై అంక్షలు విధించింది. ఆ ఆంక్షలు నీరుగారిపోయేలా చైనా తన ఉత్పత్తులను నేపాల్ కు సరఫరా చేస్తోంది. దీని ద్వారా నేపాల్ లో తన పట్టు పెంచుకోవాలన్నది చైనా ఎత్తుగడగా కనిపిస్తోంది. గతంలో భారత్ తో తలపడి భంగపడినా చైనా మాత్రం తన విఫలయత్నాలను మానుకోవడం లేదు. మరోవైపు భారత్ చైనాకు ధీటుగా సమాధానమిస్తోంది.

చైనా దేశం టెర్రరిస్టులుగా ప్రకటించిన నలుగురికి మన దేశం రావడానికి వీలుగా భారత్ వారికి వీసాలను మంజూరు చేసింది. ఈ నెల 28 న ధర్మశాలలో జరిగే ఓ సమావేశంలో వీరు పాల్గొననున్నారు. ఇంతకు ముందు పాక్ ఉగ్రవాది మౌలానా మసూద్ అజర్ ను టెర్రరిస్టుగా ప్రకటించకుండా యుఎన్ లో చైనా విటో అధికారాన్ని ఉపయోగించింది. ఇప్పుడు భారత్ చేసిన చర్య వారికి చెంపపెట్టులా మారింది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -