‘రంగస్థలం’ షూటింగ్ సమయంలో ఓ ఆసక్తికర పరిణామం జరిగింది. దర్శకుడు సుకుమార్, ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ ఇద్దరూ కలిసి స్టెప్పులతో బీభత్సం చేశారు. ఎప్పుడు… ఎవరూ చేయని విధంగా డ్సాన్స్ చేసి అదరగొట్టారు. వెయ్.. దరువేయ్ చూడు నా ఆట అన్నట్టు వీరు ముగ్గురు మాస్ డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు.
దర్శకులకు భిన్నంగా సుకుమార్ ఫైటర్స్‌తో కలిసి డ్యాన్స్ చేయడం అందర్నీ ఆకట్టుకుంటోంది. హద్దులేమీ పెట్టుకోకుండా సుకుమార్ ‘రంగస్థలం’ షూటింగ్ ప్రదేశంలో తీన్‌మార్ డ్యాన్స్ చేశాడు. ఈ డ్యాన్స్ వీడియోను రామ్‌లక్ష్మణ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియో సందడి చేస్తోంది.
రాజమండ్రి ఇసుక రేవుల్లో షూటింగ్ చేస్తూ మధ్యలో సేదదీరే సమయంలో మొదట ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ నాటు మ్యూజిక్‌కు డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత ఆ డప్పుదరువులకు తాళలేక సుకుమార్ కూడా పాదం కలిపాడు. ఈ ముగ్గురూ కలిసి మాంచి నాటు మ్యూజిక్ పెట్టుకుని స్టెప్పులేశారు. తొలుత కాళ్లు చేతులు ఊపగా ఆ తర్వాత ఆ బీట్‌కు తగ్గట్టుగా సుకుమార్ బాడీ కదుపుతూ ఇక డ్యాన్స్‌తో బీభత్సం చేశాడు. సుకుమార్, ఫైట్‌మాస్టర్లు ఇలా సందడి చేయడం ఎప్పుడు ఎక్కడ జరగలేదు.
ప్రస్తుతం ‘రంగస్థలం’ షూటింగ్ పూర్తవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకని మార్చి 30వ తేదీన ఈ సినిమా విడుదల చేయాలని ప్లాన్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌తేజ, సమంత నటిస్తున్నారు. గ్రామీణ ప్రాంత నేపథ్యంలో ఈ సినిమా ఉంది. ట్రైలర్‌తో అదరగొట్టిన చెర్రీకి సూపర్‌హిట్ సినిమాగా నిలిచే అవకాశం ఉంది.