Wednesday, April 24, 2024
- Advertisement -

రాజమౌళిపై రామ్​లక్ష్మణ్​లు సంచలన కామెంట్లు..

- Advertisement -

సక్సెస్​ఫుల్​ దర్శకుడు రాజమౌళిపై ఫైట్​ మాస్టర్లు రామ్​లక్ష్మణ్​లు సంచలన కామెంట్లు చేశారు. రాజమౌళి సినిమాకు పనిచేస్తే తమకు పేరు రాదని.. క్రెడిట్​ అంతా ఆయనకే వెళ్లిపోతుందంటూ వాళ్లు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కామెంట్లు హాట్​ టాపిక్​గా మారాయి. రాజమౌళి తెరకెక్కించిన పలు సినిమాలకు రామ్​ లక్ష్మణ్​లు ఫైట్​ మాస్టర్లుగా పనిచేశారు. అయితే ఆర్​ఆర్​ఆర్​ సినిమాకు కూడా కొన్ని రోజులపాటు ఫైట్​ మాస్టర్లుగా పనిచేసిన రామ్​లక్ష్మణ్​లు ఆ తర్వాత ఆ మూవీ నుంచి తప్పుకున్నారు. అయితే రామ్ లక్ష్మణ్​లు ఇటీవల ఓ యూట్యూబ్​ చానల్​కు ఇంటర్వ్యూకు ఇచ్చారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ’ రాజమౌళికి పనిచేయడం మాకు ఇష్టమే. ఎటువంటి అభ్యంతరం ఉండదు. కానీ ఆయన మూవీకి చేయాలంటే మేము 40 రోజులు లేదా 50 రోజులు కచ్చితంగా డేట్స్​ ఇవ్వాలి. ఆ రోజుల్లో కచ్చితంగా వెళ్లాలి. రాలేకపోతున్నాము. కుదరదు అంటే ఆయనకు నచ్చదు. ఇక పోతే రాజమౌళి సినిమాల్లో దాదాపు 70 శాతం ఫైట్​ సీన్లు ఆయనే కంపోజ్​ చేసుకుంటారు. మాకు పెద్దగా పనిఉండదు. దీంతో మాకు పనిచేశామన్న తృప్తి ఉండదు. ఆయనతో పనిచేయాలని చాలా మంది టెక్నీషియన్లు, ఫైట్​ మాస్టర్లు ఎదురుచూస్తుంటారు.

అయితే ఆయనతో పనిచేసినప్పటికీ ఫైట్​ మాస్టర్లకు పేరు రాదు. క్రెడిట్​ అంతా రాజమౌళికి వెళ్తుంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి చిత్రాల్లో పోరాట సన్నివేశాలకు ప్రత్యేక ప్రాధాన్యముంటుందన్న విషయం తెలిసిందే. ఆయన దగ్గరుండి ఫైట్​ సీన్లు కంపోజ్​ చేస్తుంటారు. మరోవైపు ఆయన సినిమాలో చిన్న పాత్ర చేసినా చాలని చాలా మంది ఆర్టిస్టులు భావిస్తుంటారు. కానీ రాజమౌళి సినిమాల షూటింగ్​ చాలా సుదీర్ఘంగా సాగుతుంటుంది. ఒక్కో సినిమాకు ఆయన దాదాపు రెండు మూడేళ్ల టైం తీసుకుంటూ ఉంటారు.

Also Read

జికా వైరస్ ఎలా సోకుతుంది? లక్షణాలు ఏమిటి?

టాప్ గేర్ లో దూసుకెళ్తున్న కృతి శెట్టికి బాలీవుడ్ ఆఫర్..!

బాలుడిని కాపాడిన విజిల్​ సినిమా.. విషయం ఏమిటంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -