Thursday, May 2, 2024
- Advertisement -

తేజ ఆమె చెంప మీద కూడా కొట్టేశాడు..!

- Advertisement -

ఇప్పటికే హోరాహోరీ సినిమా ఒక చిన్న వివాదంతో వార్తల్లోకి వచ్చింది. ఆ సినిమా దర్శకుడు తేజ, సంగీత దర్శకుడు కల్యాణ్ కోడూరిల మధ్య రేగిన వివాదం అది.

ఈ సినిమా తర్వాత మళ్లీ తేజతో తను మరో సినిమా చేయలేనేమో అని ఆ సంగీత దర్శకుడు వ్యాఖ్యానించి ఆశ్చర్యపరిచాడు. మరి తేజకు ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు. ఆయన చరిత్రలో ఇలాంటి వెన్నో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమా హీరోయిన్ కూడా ఆసక్తికరమైన ప్రకటన చేసింది. దర్శకుడు తేజ తనను కూడా కొట్టాడని ఆమె చెబుతోంది. అదికూడా చెంప మీద కొట్టాడని ఆమె అంటోంది! 

గతంలో కూడా కొంతమంది హీరోయిన్లు తేజపై ఇలాంటి ఆరోపణలు చేశారు. అతడు సినిమా షూటింగ్ తమ చెంపలను పగలగొట్టాడని వారు అన్నారు. నటన విషయంలో సరిగా చేయకపోతే తేజ అలా కొడతాడనే పేరుంది. మరి ఇదినిజమే అంటోంది “హోరాహోరీ’ హీరోయిన్ దక్ష. షూటింగ్ లో భాగంగా పలు సార్లు తేజ తనను కొట్టాడని ఆమె చెప్పింది. అయితే మరీ అంత గట్టిగా కాదని… సున్నితంగానే అని ఆమె వివరించింది. సరిగా చేయనప్పుడు. .తను కోరుకొన్న ఔట్ పుట్ రానప్పుడు తేజ తన చెంప సుతారంగా కొట్టాడని దక్ష వివరించింది.

అయితే ఆయన అలా కొట్టినా నొప్పి అనిపించలేదని… సీన్ బాగా రావాలనే తపనతోనే ఆయన అలా కొట్టి ఉండవచ్చని కూడా ఆమె చెప్పుకురావడం విశేషం! మరి తేజతో దెబ్బలు తిన్న ఈ హీరోయిన్ కెరీర్ ఏ స్థాయికి చేరుతుందో! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -