నాని. అచ్చ తెలుగు పేరు. తెలుగులో టైమింగ్ తో భాగా నోటెడైన హీరో. అతని పేరుకు తగ్గట్లుగానే అతని యాక్టింగ్ కూడా తెలుగు ప్రేక్షకులకు అలా కనెక్ట్ అయిపోతుంది.
అతను నటించినట్లు అస్సలుండదు. మన పక్కనున్న కుర్రాడు ఏదో సరదాగా మాట్లాడినట్లు,టైమింగ్ తో జోక్స్ వేసినట్లు ఉంటుంది. అందుకే కాబోలు భలే భలే మగాడివోయ్ సినిమాలో నానికి నేచురల్ స్టార్ అని పేరు పెట్టేశారు.నానికి ఈపేరు పెట్టినప్పటికీ ఎవ్వరూ ఎలాంటి కామెంట్స్ చేయలేదు.
అప్పట్లో రవితేజకు మాస్ మహారాజా అని హరీష్ శంకర్ బిరుదు ఇస్తే …దాన్నెవరూ కాదనలేదు. ఎందుకంటే రవితేజ నిజంగానే మాస్ లో ఓ రేంజున్న హీరో.అలాగే రానాను టాలీవుడ్ హంక్ అంటే అస్సలెవరు నెగిటివ్ కామెంట్స్ చేయలేదు. దీనికి రీజన్ …రానా నిజంగానే హంక్ లాగ ఉంటాడు కాబట్టి అలాంటి టైటిల్ ఇచ్చారు. ఇపుడదే మాదిరిగా నాని డైలాగ్ డెలివరీ ,బాడీ లాంగ్వేజ్ అతనిలోని ఈజ్ ను చూసి నేచురల్ స్టార్ అని మారుతి ఓ స్టార్ టైటిల్ ఇచ్చేశాడు. దీనికి ఎవ్వరూ నో చెప్పలేదు.
