Monday, May 13, 2024
- Advertisement -

శృంగార సన్నివేశాల్లో తేజస్వీ.. మీటూ ప్రభావం..!

- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా మీటూ ఉద్యమం ఎంతంటి సంచలనం రేపిందో అందరికి తెలిసిందే. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల నేపథ్యంలో #MEETOO అంటూ బాధితులంతా తెరపైకి వచ్చారు. ఈ లైంగిక దాడులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ కమిటీ వేసి విచారణ చేపడుతోంది. తాజాగా ఈ అంశంపై ఓ దర్శకుడు వెబ్ సిరీస్ ను తీసుకొస్తున్నాడు.

ఆ వెబ్ సిరీస్ లో హాట్ బ్యూటీ తేజస్వి మదివాడ నటిస్తోంది. తేజస్వికీ ఇది చక్కని అవకాశం నటిగా రాణించాలని కొన్నేళ్లగా గట్టి ప్రయత్నాలు చేస్తున్న తనకు నిరూపించుకునే ఛాన్స్ దక్కిందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ఐస్ క్రీమ్ మూవీలో అర్దనగ్నంగా నటించి సంచలనం రేపిన తేజస్వీ.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తోంది.

అయితే నటిగా చెప్పుకోదగ్గ ఛాన్స్ లు ఈమెకు రాలేదు. ఈ క్రమంలో మీటూ నేపథ్యంలో సాగే వెబ్ సిరీస్ లో మెయిన్ లీడ్ కు ఎంపికవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ వెబ్ సిరీస్ కు హైదరబాద్ నవాబ్స్ ఫేమ్ లక్ష్మీ కాంత్ చెన్నా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తేజస్వి మరింత హాట్ గా కనిపించనుందట. బాలీవుడ్ వెబ్ సిరీస్ మాదిరి శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోనుందని తెలుస్తోంది.

మీటూ నేపథ్యం కాబట్టి సినీపరిశ్రమ సహా ఇతర రంగాల్లో అవకాశాల పేరుతో కామాంధులు మహిళలను ఎలా లోబరుచుకున్నారు? ప్రతిఘటించే ప్రయత్నంలో ఎలాంటి ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు? లాంటి బోల్డ్ స్టోరీ. కంటెంట్ లో ఈ వెబ్ సిరీస్ రూపొందినుంది. ఈ వెబ్ సిరీస్ కు తో ఫాంలోకి రావాలని తేజస్వి చూస్తోంది. తెలుగు, హిందీ భాషల్లో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కునుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -