Friday, May 17, 2024
- Advertisement -

కొత్త ప్రొగ్రాంలో నాగబాబు ఎంత ఇస్తున్నారంటే ?

- Advertisement -

మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ ను వదిలేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయనపై రకరకల వార్తలు వస్తునే ఉన్నాయి. అయితే నాగబాబు జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడానికి చాలా కారణాలు వచ్చినప్పటికి రెమ్మ్యూనరేషన్ ఇష్యూ మాత్రం బాగా వైరల్ అయింది. ఇప్పుడు ఇదే అసలు సీక్రెంట్ అంటూ మరో వార్త తెరపైకి వచ్చింది. విషయంలోకి వెళ్తే.. జబర్దస్త్ ను కేవలం 25 ఎపిసోడ్స్ కోసమే ప్లాన్ చేసుకున్నారని.. తనతో పాటు రోజాను జడ్జిగా సెలక్ట్ చేశారని గతంలోనే నాగబాబు చెప్పారు.

తర్వాత జబర్దస్త్ నచ్చి కొనసాగాను. అలా ఏడేళ్ల పాటు కంటిన్యూ అయిందని నాగబాబు అన్నారు. అయితే నాగబాబు డబ్బు కోసమే జబర్ధస్త్ కామెడీ షో వేదిలేశారని, అందుకే ఆయన అక్కడ్నుంచి తప్పుకుని ఇప్పుడు జీ తెలుగుకు వచ్చేశాడని అంటున్నారు. తన స్థాయికి తగిన రెమ్యునరేషన్ అక్కడ ఇవ్వకపోయినా కూడా చాలా రోజుల నుంచి చేస్తున్నానని నాగబాబు చెప్పడం చర్చనీయాంశం అయింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు జబర్దస్త్ నుంచి తప్పుకున్న నాగబాబు.. ఇప్పుడు జీలో అదిరిపోయే పారితోషికం అందుకుంటున్నాడట.

గతంలో జబర్దస్త్ షోకి వచ్చిన దానికంటే మూడు రెట్లు ఎక్కువ ఇక్కడ ఇస్తున్నారని, అందుకే నాగబాబు ఛానెల్ మార్చేసాడని ప్రచారం ఊపందుకుంది. జీ నెట్ వర్క్ నుంచి నాగబాబు.. ప్రతీ నెల 30 లక్షలు అందుకుంటున్నాడట. ఇక మరోవైపు నాగబాబు ఉన్నా లేకున్నా కూడా జబర్దస్త్ హవా మాత్రం అలాగే కొనసాగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -