Monday, May 13, 2024
- Advertisement -

జడేజా రనౌట్‌పై స్పందించిన పొలార్డ్..!

- Advertisement -

భారత్‌, వెస్టీండీస్ మధ్య జరిగిన తొలి వన్డేల్లో జడేజా రనౌట్ కావడంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. రీప్లేలో చూశాక ఫీల్డ్ అంపైర్ షాన్ మూడో అంపైర్ నిర్ణయాన్ని కోరడం ఎంత వరకు కరెక్ట్ అనే వాదన వినిపిస్తోంది. విషయంలోకి వెళ్తే.. కీమో పాల్ వేసిన 48వ ఓవర్లో జడేజా సింగిల్‌ కోసం ట్రై చేశాడు.

ఫీల్డర్‌ చేజ్‌ నేరుగా విసిరిన బంతి నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో వికెట్లను గిరాటేయగా.. అప్పటికీ జడేజా తన బ్యాట్‌ను క్రీజులో పెట్టలేదు. కాకపోతే అది గుర్తించలేదు. విండీస్ ఫీల్డర్లు కూడా అప్పీలు చేయలేదు. అయితే రీప్లేలో జడేజా రనౌటైనట్లుగా చూపించాక అంపైర్ షాన్ మూడో అంపైర్ ను సంప్రదించాడు. దాంతో జడేజా రనౌటయ్యాడు. దీనిపై విరాట్ కోహ్లీ తీవ్ర అసహనాన్ని ప్రదర్శించాడు.

తన కుర్చీలో నుంచి లేది మైదానం వైపు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్ తర్వాత జడేజా రనౌట్ పై పొలార్డ్ స్పందించాడు. ’రనౌట్ పై అంతిమంగా సరైన నిర్ణయం తీసుకున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. విజయంలో హెట్‍మెయిర్ ప్రధాన పాత్ర పోషించాడు. అతడు గత 9 నెలల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. అతడి ఇన్నింగ్స్‌పై జట్టు యాజమాన్యం ఎంతో సంతోషంగా ఉంది.

ప్రతి ఆటగాడు బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంగా ఆడాలి. కాట్రెల్ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు’ అని పొలార్డ్‌ మ్యాచ్‌ అనంతరం అన్నాడు. ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్‌ ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. విశాఖ వేదికగా రెండో వన్డే బుధవారం జరగనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -