Monday, April 29, 2024
- Advertisement -

సుమంత్‌కు సీఎం కేసీఆర్ ఫోన్‌… మ‌ళ్లీరావా ప్రింట్ కావాల‌ని అడిగిన‌ కేసీఆర్‌

- Advertisement -

ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నుంచి సుమంత్‌కు ఫోన్ వ‌చ్చింది. సుమంత్ న‌టించిన సినిమా ప్రింట్ కావాల‌ని, త‌న నివాసానికి పంపించాల‌ని అడిగారు. అడిగిన వ్య‌క్తెవ‌రో కాదు తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు. మొద‌టి నుంచి అక్కినేని కుటుంబంతో మంచి సంబంధం కొన‌సాగిస్తున్న కేసీఆర్ సుమంత్ సినిమా విజ‌య‌వంతానికి తాను కూడా కృషి చేస్తున్నాడు. నాగార్జునతో కేసీఆర్‌కు బంధం లేద‌ని చెబుతున్నా పైపైన చెబుతున్నా ఇద్ద‌రి ఓ అండ‌ర్‌స్టాండింగ్ ఉంద‌ని తెలుస్తోంది. నాగార్జున కుటుంబం సుమంత్ సినిమా విజ‌య‌వంతానికి చాలా కృషి చేశారు. నాగ‌చైత‌న్య‌, స‌మంత‌, అఖిల్ ఇలా అంద‌రూ సినిమా ప్రమోష‌న్స్‌లో పాల్గొన్నారు.

వీరి జాబితాలో ఏకంగా ఓ ముఖ్య‌మంత్రి వ‌చ్చి చేర‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యాన్ని సుమంతే త‌న ట్విట‌ర్‌లో చెప్పుకొచ్చారు. ‘మళ్లీరావా’ గౌతమ్‌ తిన్నమూరి దర్శకత్వం వహించారు. శుక్రవారం (డిసెంబ‌ర్ 8) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం మంచి టాక్‌ అందుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాసం నుంచి తనకు సందేశం వచ్చినట్లు సుమంత్‌ ట్వీట్‌ చేశారు. ఎంతో సంతోషంగా భావించి పంపినట్లు పేర్కొన్నారు.

ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్ హీరోయిన్‌గా, అన్నపూర్ణ, అభినవ్‌, మిర్చికిరణ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. స్వధర్మ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రాహుల్‌ యాదవ్‌ నక్క సినిమాను నిర్మించారు. శ్రవణ్‌ భరద్వాజ్ సంగీతం అందించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -