Sunday, May 5, 2024
- Advertisement -

సినీ నటుడు అరెస్ట్ …కార‌ణం ఏంటో తెలుసా?

- Advertisement -

టీవీ సీరియాళ్ల‌తో పాటు ప‌లు సినిమాల‌లో కూడా న‌టించి త‌న కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రామచంద్రబాబు.తాజాగా అతడిని పోలీసులు అరెస్ట్ చేశార‌ని తెలుస్తుంది.దాదాపు పదేళ్ల క్రితం రామచంద్రబాబుపై నగర నేర పరిశోధన విభాగం అధికారులు కేసు నమోదు చేశారు. అప్పట్లో ముందస్తు బెయిల్ పొంది అరెస్ట్ నుండి తప్పించుకున్నాడు. కానీ ఈసారి మాత్రం అధికారులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యాడు.బంజారాహిల్స్ లోని సర్వే నెం.129/35 లో ఖాదర్ భాషాతో పాటు మరికొందరికి మూడు ఎకరాలు, 21 గుంటల స్థలం ఉంది. వీరికి ఇరవై లక్షలు ఇస్తానంటూ కొన్ని పత్రాలపై సంతకాలు పెట్టించుకున్నాడు రామచంద్రబాబు.

ఆ సంతకాలు వాడుకొని స్థలం తన పేరు మీదే ఉందని.. సంతోష్ నగర్ కి చెందిన శ్రీఇనివాస్ అనే వ్యక్తిని నమ్మించి అతడి దగ్గర నుండి రూ.60 లక్షలు తీసుకున్నాడు.స్థలంలో వాటా ఇవ్వకపోగా, డబ్బు కూడా ఇవ్వడం లేదని శ్రీనివాస్ వాకబు చేయగా అసలు స్థలం కూడా రామచంద్రబాబుది కాదని తెలుసుకున్నాడు. ఈ క్రమంలో అతడు 2009లో నగర నేర పరిశోధన అధికారులకి ఫిర్యాదు చేశాడు. అతడిని అదుపులోకి తీసుకుందామనుకుంటే ముందస్తు బెయిల్ తో బయటపడ్డాడు. గత నెలలో ఈ బెయిల్ గడువు ముగిసింది. దీంతో అధికారులు రామచంద్రబాబుని అరెస్ట్ చేశారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -