Thursday, May 2, 2024
- Advertisement -

హాలీవుడ్‌లో విషాదం

- Advertisement -

ప్ర‌ముఖ హాలీవుడ్ లెజండరీ కామిక్ రైటర్ స్టాన్లీ మంగ‌ళ‌వారం కన్నుమూశారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన న్యూయార్క్‌లోని తన నివాసంలో కన్నుమూశారు.దీంతో హాలీవుడ్‌లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.1939 డిసెంబర్ 28న జన్మించిన స్టాన్లీ 1961లో మార్వెల్ కామిక్స్‌లో చేరారు. తన ఊహాలకు పుస్తకరూపం ఇస్తూ ఆయన సృష్టించిన పాత్రలు పుస్తక ప్రియులను ఆకట్టుకున్నాయి.

అలా ఆయన సృష్టించిన పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసింది మార్వెల్ సంస్థ.ఎక్స్‌ మ్యాన్, స్పైడర్ మ్యాన్, అవెంజర్స్, బ్లాక్ పాంథర్, డాక్టర్ స్ట్రేంజ్, డేర్‌డెవిల్, హల్క్, ఐరన్‌ మ్యాన్ అలా వచ్చినవే. మార్వెల్, వాల్ట్ డిస్నీ సంస్థల ఎదుగుదలలో స్టాన్టీ పాత్ర మరువలేనిది.అందుకే మార్వెల్ కామిక్ పుస్తకాన్ని తెరిచినప్పుడల్లా స్టాన్లీనే గుర్తొస్తారు అంటూ మార్వెల్ తన సంతాప ప్రకటనలో పేర్కొంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -