Sunday, May 5, 2024
- Advertisement -

12 ఏళ్ళ తరవాత మళ్ళీ వస్తున్న హాట్ హీరోయిన్

- Advertisement -

హీరోయిన్ రాశి ఒకానొక సమయంలో తెలుగులో ఒక వెలుగు వెలిగింది. ఆమె దశాబ్దం క్రితం వరకూ ఎక్కడోక్కడ కథా నాయికగానే కనపడింది. అడపాదడపా కనిపిస్తూ సాగిన ఆమె తరవాత ఫ్యామిలీ తో బిజీ అయ్యో మరి బాడీ బాగా పెరిగిపోయో సినిమాలలో కనపడ్డం మానేసింది. అప్పట్లో చాలా క్రేజ్ ఉన్న హీరోయిన్ గా రాశి కి పేరుంది. ముఖ్యంగా కుర్రాళ్ళకి ఈమె హాట్ హీరోయిన్. 

చాలా హాట్ సాంగ్స్ లో రొమాంటిక్ గా నటించిన రాశి పెద్ద హీరోలు అందరి పక్కా చేసింది. నివాస్ అనే కో డైరెక్టర్ ని పెళ్లి చేసుకుని సడన్ గా సినిమాలు మానేసింది ఆమె. ఇప్పుడు మళ్ళీ సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెడతా అంటోంది రాశి. దాదాపు 12 సంవత్సరాల తరవాత ఆమె మొఖానికి రంగు వేసుకోబోతోంది. ఇదే విషయం మీద మాట్లాడుతూ చాలా గ్యాప్ తరవాత తిరిగ నటిస్తున్నా నని ఇంత గ్యాప్ వచ్చినా అసలు కొత్తగా ఆనిపించాట్లేదు అంటోంది.

 ” ఇంత గ్యాప్ వచ్చినా నాకు కెమెరా ముందు కొత్తగా అనిపించలేదు. అప్పుడెలా ఉందో ఇప్పుడూ కూడా అలానే ఉంది.. వెనకటి రోజులకు ఇప్పటికి చాలానే తేడా వచ్చింది. అప్పుడు నేను కేవలం గ్లామర్ కే పరిమితం కాలేదు. చక్కగా నటించే పాత్రలకు స్కోప్ ఉండేది.

కానీ ఇప్పుడలా కాదు. ఏదో చేశాంలే అనిపించే క్యారెక్టర్లలో హీరోయిన్ లు కనిపిస్తున్నారు” అని చెప్పింది. ఈ మధ్య మా టీవీ లో స్పెషల్ ప్రోగ్రాం లలో కనిపిస్తున్న ఆమె లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్సకత్వం వహిస్తున్న కళ్యాణ వైభోగమే సినిమా లో హీరోయిన్ కి తల్లిగా కనిపిస్తోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -