Thursday, May 30, 2024
- Advertisement -

చిరు 150 వ చిత్రానికి స్క్రిప్ట్ రెడీ…!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రంపై చాలా రోజులుగా నీలి నీడలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ నీడల్లో నుంచి వెలుగులు చిమ్మెలా మెగా అభిమానులకు ఊరటనిచ్చేలా తాజాగా వార్తలు వినవస్తున్నాయి. చిరు 150 వ చిత్రం పై త్వరలోనే ఓ ప్రకటన రాబోతున్నట్లు సమాచారం.

మొదట పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో చిరు 150 వ చిత్రం వస్తుందని వార్తలు వచ్చినప్పటికీ, పూరి చెప్పిన కథలో సెకండ్ హాఫ్ నచ్చకపోవడంతో పూరిని పక్కన పెట్టేశారు. ఆ తరువాత చిరు చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తారని ఊహాగానాలు వెలువడినప్పటికీ అఖిల్ చిత్రం డిజాస్టర్ గా మిగలడంతో వినాయక్ ను కూడా మెగా కాంపౌండ్ పక్కన పెట్టేసిందని తెలుస్తోంది.

కానీ తాజా సమాచారం ప్రకారం వివి. వినాయక్ దర్శకత్వంలోనే చిరు 150 వ చిత్రం రాబోతుందని, చిరంజీవికి చెందిన పలు చిత్రాలకు పవర్ ఫుల్ డైలాగ్స్ అందించిన పరుచూరి బ్రదర్స్ చిరు తాజా చిత్రానికి స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసినట్లు సమాచారం.

అంతా సవ్యంగా సాగితే సంక్రాంతికి చిరు 150 వ చిత్రం పై ప్రకటన వెలువడే అవకాశం లేకపోలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -