గ్రాఫిక్స్ .అవి లేందే నేటి రోజుల్లో సినిమా లేదు.కొన్ని చిత్రాలు గ్రాఫిక్స్ మీదనే రన్ అవుదామనుకుంటాయి.అలా ఓ అడుగు ముందుకేసి చివరి నిమిషం వరకూ కంప్లీట్ కాకుండా ప్రొడ్యూసర్లను,హీరోల అభిమానులను ఎంతగానో బాధపెడుతుంటాయి.
తాజాగా అఖిల్ చిత్రంతో ఇదే ఇష్యూ తెరపైకి వచ్చింది.గ్రాఫిక్స్ లేందే నేటి సినిమా లేదు.ఆ గ్రాఫిక్స్ తోటే… సగటు సినీ ప్రేక్షకుడిని కాసేపు థియేటర్లో అలా కూర్చోబెట్టి కాసులు కుమ్మేయడం మొదలు పెట్టారు.
ఈవిషయంలో రీసెంట్ గా వచ్చిన చాలా చిత్రాలు ప్రేక్షకుడిని గట్టిగానే బాదాయి.తాజాగా అఖిల్ చిత్రం కూడా ఇదే కోవలోకి వచ్చి చేరింది.ఇక సినిమా వచ్చే వారం రిలీజ్ అవ్వాల్సి ఉండగా లాస్ట్ మినిట్లో మూవీ ఆగిపోయింది.కారణం గ్రాఫిక్స్ అంటున్నారు. ఆడియన్సు నాసిరకం గ్రాఫిక్ వర్కును అస్సలు ఒప్పుకోవడం లేదు.అందుకే అఖిల్ సినిమాలో గ్రాఫిక్సు వర్కు బాగా రాలేదని సినిమాను రిలీజ్ చేయట్లేదు. ఒక్కసారి అది పూర్తవ్వగానే రిలీజ్ చేసేస్తాం” అంటూ సెలవిచ్చారు కింగ్ నాగార్జున.
అసలు బాహుబలి సినిమా వచ్చాక మన తెలుగు సినిమా స్థాయి పెరిగింది. దీంతో బాహుబలి తరువాత వచ్చిన చిత్రాలు కొన్ని ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వస్తోంది. ప్రతి సినిమాలోను గ్రాఫిక్స్ ఆ రేంజ్ లో ఉండాల్సిందేనని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు.పులి చిత్రమే తీసుకుందాం. ఈసినిమాలో గ్రాఫిక్స్ పులిని చీల్చి చెండాడాయి.ఎందుకు ఇలాంటి గ్రాఫిక్స్ చేసారో కూడా అర్ధం కాదు.దానికి కారణం…గ్రాఫిక్స్ నాసిరకంగా ఉంటే మళ్లీ రీ వర్క్ చేయించుకోవాలి అలాంటిదేమి పులికి జరగలేదు.నాసిరకం గ్రాఫిక్స్ తో ఈ మధ్య భాగా దెబ్బతిన్న చిత్రం… రుద్రమదేవి . ఏనుగు,సింహం ఫైటింగ్ ఒకటి. ఈ ఫైట్ చూసిన ప్రతి ఒక్కరు…. గ్రాఫిక్స్ గురించి దారుణంగా కామెంట్స్ చేశారు.ఇన్ టైమ్ కు గ్రాఫిక్స్ కానపుడు ఇంకాస్త టైమ్ తీసుకోవాలి. అలా తీసుకుని కూడా నాసిరకంగా గ్రాఫిక్స్ కు ఎలా చేయించుకున్నావంటూ గుణాను చీల్చి చెండాడేశారు. మొత్తానికి ఏదో మమ అనిపించేశాడు.
గ్రాఫిక్స్ మ్యాటర్లో సందేహాలు వచ్చినప్పుడు దాని గురించి రీసెర్చ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. కోడి రామకృష్ణ…శ్యామ్ ప్రసాద్ రెడ్డితో అలా చేసే సక్సెస్ అయ్యాడు.ఆ తరువాత రాజమౌళి అదే యాంగిల్లో తన సొంత తెలివితేటలతో సక్సెస్ అయ్యాడు.ఈగ టైమ్లో కూడా నాసిరకం గ్రాఫిక్స్ చూసి చాలా దిగాలు చెందాడు.ఆతరువాత టైమ్ తీసుకుని అనుకున్న అవుట్ పుట్ తెచ్చాడు.అదే కాన్పిడెంట్ తో బాహుబలిని టేకప్ చేసాడు.అది కూడా ఆ యాంగిల్లో సక్సెస్ అయింది.సో మనవాళ్లు గ్రాఫిక్స్ వాడుకోదలచుకుంటే… మ్యాక్జిమమ్ చేయదలచుకున్న గ్రాఫిక్స్ పై రీసెర్చ్ వర్క్ చేయాల్సి ఉంటుంది.అలా చేయకపోతే ఇలాగే అఖిల్ మాదిరిగా డేట్లు మార్చుకోవల్సి ఉంటుంది. సో ఈవిషయంలో అందరూ మన జక్కన్నను ఫాలో అయిపోవడం బెటర్ .