Friday, May 17, 2024
- Advertisement -

బిగ్‌బాస్‌-2కు కూడా తార‌కే

- Advertisement -

వ‌చ్చే వేస‌విలో ప్ర‌సార‌మ‌య్యే అవ‌కాశం

విదేశాల నుంచి బిగ్‌బాస్ షో భార‌త్‌కు వ‌చ్చేసింది. తొలుత హిందీలో ఈ షో ప్ర‌సార‌మై అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది. ఇక హిందీ త‌ర్వాత అన్ని భాష‌ల్లోకి దాదాపు వ‌చ్చేసింది. అయితే ఈ షో వ‌ల‌న ఎన్నో వివాదాలు, ఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకుంటున్నాయి. త‌మిళ్, మ‌ల‌యాళం భాష‌ల్లో రాగా తెలుగులో చిరంజీవితో మొద‌లైంది. ఆ త‌ర్వాత నాగార్జున కూడా చేశార‌. గ‌తేడాది జూనియ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌హ‌రిస్తూ బిగ్‌బాస్ షో కొన‌సాగింది. ఈ షో ప్రేక్ష‌ల‌కును విశేషంగా ఆక‌ట్టుకుంది. ఈ షో వ‌ల‌న ఎన్టీఆర్ ఇమేజ్ పెరిగడంతోపాటు బిగ్‌బాస్ షోకు క్రేజీ ఏర్ప‌డింది. దీంతో మ‌ళ్లీ రెండోసారి బిగ్‌బాస్ షోకు హోస్ట్ చేసే అవ‌కాశం ఇచ్చారు.

బిగ్‌బాస్ షో మొద‌టిసారి ఎన్టీఆర్ బిజీగా ఉన్నా స‌మ‌యం కేటాయించారు. షోలో పాల్గొంటూనే జై ల‌వ‌కుశ సినిమా పూర్తి చేశాడు. ఇప్పుడు కూడా బిజీగా ఉంటున్నా బిగ్‌బాస్‌-2 కోసం డేట్స్ ఇచ్చాడ‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ డేట్స్‌కు అనుగుణంగా షో ఎప్పుడు చేయాల‌ని నిర్వాహ‌కులు ఆలోచ‌న చేస్తున్నారు. బిగ్‌బాస్-2 షూటింగ్ పూర్తి చేసి 2019 వేస‌విలో ప్రసారం వేయాల‌ని నిర్వాహ‌కులు భావిస్తున్నారు.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -