Sunday, April 28, 2024
- Advertisement -

యదార్థ సంఘ‌ట‌న‌ల‌తో ‘ఇంటిలిజెంట్’

- Advertisement -

వరుసగా ఫెయిల్యూర్‌తో సాయిధరమ్ తేజ్ బాధ‌ప‌డుతున్నాడు. వాటి నుంచి కోలుకుని ప్ర‌స్తుతం ‘ఇంటిలిజెంట్’పై కొంత భ‌రోసాతో ఉన్నాడు. ఈ సినిమా వివి.వినాయక్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొందుకుంటోంది. దీంతో ఈ సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. అయితే ఈ సినిమా య‌దార్ఘ సంఘ‌ట‌న‌ల‌తో రూపుదిద్దుకుంద‌ని స‌మాచారం.

ఈ సినిమాలో సాయి ధ‌ర‌మ్‌తేజ్ సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్‌గా ధర్మాభాయ్ అనే పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమా నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కిందని సినిమా బృందం ప్ర‌క‌టించింది. 2014లో హైద‌రాబాద్‌ కూకట్‌పల్లి రింగ్‌రోడ్డులో జరిగిన ఓ ఘటన ప్రభావం ఈ సినిమాలో ఉంటుందట. 2011 – 2016 మధ్యకాలంలో హైదరాబాద్‌లో ఉగ్రవాదం సృష్టించిన క్రూరమైన నేర ముఠా ‘స్నేక్ గ్యాంగ్’ ఆధారంగా ఉంటుందని ఇటీవ‌ల వినాయ‌క్ ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపాడు. ఈ గ్యాంగ్ వారు పాముతో కాటేయిస్తాం అని బెదిరించి దాదాపు 25 జంటలను కొట్టి.. అమ్మాయిలను రేప్ చేసినట్లు మీడియాలో వ‌చ్చింది. విలన్, హీరోల మధ్య వచ్చే మైండ్‌గేమ్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంది. వినాయక్ తన రెగ్యులర్ ఫార్మాట్ లా కాకుండా కొన్ని సీన్స్‌లలో ప్రయోగాలు చేస్తున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -