Saturday, May 4, 2024
- Advertisement -

హరితేజ ఆనందం.. అర్చన అరుపుల ఏడుపు..

- Advertisement -

బిగ్ బాస్ షో.. ఇప్పుడు తెలుగు బుల్లితెరపై మంచి పేరు తెచ్చుకుంటున్న షో. అయితే ఈ షోలో మొన్నటివరకు కోపాలు, చిరాకులు, మనస్పర్థలు, గొడవలు ఇలా రకరకలైన ఎపిసోడ్స్ చూసారు. కానీ గత రెండు రోజులుగా మాత్రం బిగ్ బాస్ అనందపు జల్లులు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 12న శివబాలాజీ వైఫ్ మధుమిత.. బిగ్ బాస్ షోలోకి వచ్చి.. అందరికి షాక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆదర్శ్ భార్య గుల్నార్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

అలానే వీరి అబ్బాయి నిర్వాణ్‌ కూడా రావడంతో.. బిగ్ బాస్ హౌస్ లో సంతోషకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా ఒక్కొక్కరికి ఇంటి సభ్యుడికి సంబంధించిన వ్యక్తులు రావడంతో అర్చన మాత్రం తట్టుకోలేక తెగ ఏడ్చేసింది. తన కుటుంబ సభ్యులకు దూరంగా వుండటం, వారు ప్రతిక్షణం గుర్తొస్తూ వుండటంతో అర్చన వెక్కి వెక్కి బోరుమన్నది. ఇక సెప్టెంబర్ 13న జరిగిన ఎపిసోడ్‌లో అర్చన వాళ్ల అమ్మ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో… అర్చన బోరుమంటూ తెగ ఏడ్చేసింది. అలానే కాసేపటి తర్వాత హరితేజకు కూడా బిగ్ బాస్‌ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. హరితేజ భర్త దీపక్ ఎంట్రీ ఇచ్చాడు. దీపక్ రాకతో హరితేజ ఫుల్ ఖుషీలో వుంది. అలాగే ఎపిసోడ్ చివర్లో నవదీప్ సిస్టర్ దీప్తి ఎంట్రీ ఇచ్చింది. నవదీప్ మాత్రం తన వాళ్లని మిస్ అవుతున్న అనే ఫీలింగ్ లేకుండా.. ఇంటి సభ్యులతో కలిసి ఆనందంగా గడిపేస్తున్నాడు.

ఇంటి సభ్యుల ఆనందంలో తన అనందం చూసుకుంటున్నాడు నవదీప్. ఇక శివబాలాజీ ఫైనల్‌కు చేరడంతో.. ఎలిమినేషన్ లో లేడు. ఇక ఈ వారం ఎలిమినేషన్ లో ఎవరు ఉంటారో అనేది చాలా ఉత్కంఠగా మారింది. నవదీప్, హరితేజ ఎలిమినేషన్ లో ఉండరని.. దీక్షాపంత్, ఆదర్శ్, అర్చనలు ఎలిమినేషన్ లో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. 70రోజుల కాల వ్యవధి ముగింపుకు సమయం దగ్గరపడుతుండటంతో బిగ్ బాస్ సీజన్ 1 విజేత ఎవరూ కాబోతున్నారోననే ఉత్కంఠ పెరిగిపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -