Thursday, March 28, 2024
- Advertisement -

ఈ నినాదంతో ఎన్నిక‌ల‌కువెలితే బాబు పీపీపీ… గోవిందా…. డిపాజిట్లుకూడా రావు

- Advertisement -

ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయాల‌లో కొత్త స‌మీక‌ర‌ణాలు చోటుచేసుకుంటున్నాయి. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా మార్పులు ఉండ‌బోతున్నాయి. నిన్న‌టి వ‌కు రాజ‌కీయాలు ఒక ఎత్తైతె…..ఇప్ప‌టినుంచి మ‌రో ఎత్తు. టీడీపీ-భాజాపాకు చెక్ పెట్టేందుకు రాజ‌కీయ పార్టీల‌న్నీ ఒకే గొడుగు కింద‌కు వ‌స్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. అధికార పార్టీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై వైసీపీ అధినేత జ‌గ‌న్ ఎంత పోరాటం చేస్తున్నా ఫ‌లితాలు మాత్రం అంతంత మాత్రంగానె ఉన్నాయి. టీడీపీని ఢీకొట్టాలంటె జ‌గ‌న్‌కు ఉన్న ఇమేజ్ స‌రిపోవ‌డంలేదు. అందుకే పార్టీలో కొత్త స‌మీక‌ర‌ణాల‌కు తెర‌లేపుతున్నారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో చిరంజీవి వైసీపీలో చేరుతార‌నె వార్త వైర‌ల్‌గా ట్రెండ్ అవుతోంది. వచ్చే ఏడాదితో చిరంజీవి రాజ్యసభ సభ్యత్వానికి కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు హ్యాండ్ ఇవ్వ‌బోతున్నార‌నె వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. చిరంజీవి రాజకీయ ప్రయాణం ఎలా సాగుతుందనే దానిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. ఇప్ప‌టికె వివిధ పార్టీల నుంచి ఆయనకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం.

వైసీపీ, టీడీపీ నుంచి రాజ్య‌స‌భ‌సీటు ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత చిరంజీవి అసెంబ్లీలో వైఎస్ గురించి ఎంతో భావోద్వేగంతో మాట్లాడాడు వైఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే కాంగ్రెస్‌ను గెలిపించాయని చెప్పిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇక ఇప్పుడు జగన్ కూడా నవరత్నాలు పేరుతో అచ్చం వైఎస్ ప్రవేశ పెట్టిన పథకాలనే ప్రజల ముందుకు తీసుకొని వెల్తున్నారు.

టీడీపీ 2014 ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. ఇక కాపులని బీసీలలో చేరుస్తానని చెప్పి మోసం చేయడం, ముద్రగడ చేస్తున్న పాదయాత్రను అణచి వేయ‌డం..ఇలాంటి ప‌రిస్థితుల మ‌ధ్య చిరంజీవి వైసీపీ వైపే మొగ్గు చూపుతాడని జ‌గ‌న్ త‌న‌కి ఇవ్వాల్సిన గౌర‌వం ఇస్తాన‌ని హామీ ఇస్తే చిరంజీవి వైసీపీలోకి వెళ్ళే అవ‌కాశాలే ఉన్నాయ‌ని తెలుస్తోంది.

చిరంజీవి, ప‌వ‌న్‌ల మ‌ద్ద‌తు తీసుకోవాల‌ని జ‌గ‌న్‌కు ప్ర‌శాంత్ కిషోర్ సూచించ‌డంతో ఆదిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. మెగాస్టార్ వైసీపీలోకి వ‌స్తె అటోమేటిగ్‌గా ప‌వ‌న్ కూడా జ‌గ‌న్‌కు స‌పోర్ట్ తెల‌ప‌డం ఖాయం. బాబుతో ప‌వ‌న్ సానుకూలంగా వ‌చ్చె ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

ఇవ‌న్నీ బాగానె ఉన్నా టీడీపీ-భాజాపాకు చెక్ పెట్టాలంటె జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాల‌తోపాటు…ప్ర‌త్యోక హోదా నినాదాన్ని బ‌లంగా ప్ర‌జ‌ల‌ల్లోకి తీసుకెల్లాల్సి ఉంటుంది. ఇప్ప‌టికె ప్ర‌త్యేక హోదాపై టీడీపీ-భాజాపా చేతులెత్తేసిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ క‌ళ్యాన్ కూడా ప్ర‌త్యేక‌హోదా ప్ర‌జ‌ల హ‌క్కుఅని ప్ర‌క‌టించారు. ప‌వ‌న్‌.జ‌గ‌న్‌ల‌తోపాటు ఒకే సారుప్య‌త క‌లిగిన పార్టీల‌న్ని కూడా ఒకే గొడుగుకింద‌కు ర‌వాల్సి ఉంటుంది.

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌, చిరు మేనియాతోపాటు జ‌గ‌న్ ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెల్లాల్సి ఉంటుంది. దీంతో పాటు ఏపీకి గండెలాంటి ప్ర‌త్యేక హోదానుకూ ప్ర‌జ‌ల‌ల్లోకి బ‌లంగా తీసుకెల్తే టీడీపీ డిపాజిట్లు కూడా రావ‌ని రాజ‌కీయ వ‌ర్గాల అంటున్నాయి. మ‌రో వైపు కాంగ్రెస్ కూడా రాష్ట్రాన్ని విభ‌జించి చాల త‌ప్పు చేశామ‌ని పార్టీ నాయ‌కులు అంటున్నారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వ‌స్తే ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని సోనియాగాంధీచేత ప్ర‌క‌టన చేయించి…జ‌గ‌న్‌కు క్ష‌మాప‌ణ చెప్పి క‌లుపుకొని పోవాల‌ని సీనియ‌ర్‌నేత‌ల ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుందా…? చూడాలి భ‌విష్య‌త్తులో ఏంజ‌రుగుతుందో…..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -