Saturday, May 18, 2024
- Advertisement -

లైంగిక వేధింపులలో ‘మా అధ్య‌క్షుడు’ కూడానా…

- Advertisement -

తెలుగు ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊపుతున్న కాస్టింగ్ కౌచ్‌, ఇప్పుడు పెద్ద సంచ‌ల‌నంగా మ‌రే అవ‌కాశం క‌నిపిస్తుంది.శ్రీరెడ్డి మొద‌లు పెట్టిన అందోళ‌న‌కు అన్ని వైపుల నుండి త‌న‌కు మ‌ద్ద‌తు ల‌భించింది.ద‌గ్గుబాటి స‌రేష్ త‌న‌యుడు అభిరాం త‌న‌కు అవ‌కాశాలు ఇస్తాన‌ని చెప్పి త‌న‌ను వాడుకొని వ‌దిలేశాడ‌ని మీడియా సాక్షిగా త‌న‌కు జ‌రిగిన అన్యాయం గురించి చెప్పుకొచ్చింది.శ్రీరెడ్డి ప్రేర‌ణ‌గా తీసుకున్న చాలామంది త‌మ‌కు జ‌రిగిన అన్యాయం గురించి మీడియా ఎదుట త‌మ గోడుని వెళ్ల‌బొసుకుంటున్నారు.ఇప్పుడు ఏకంగా ‘మా అధ్య‌క్ష‌డు’ శివాజీ రాజాపైనే ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఇండ‌స్ట్రీ మొత్తం షాక్‌ గురైంది. తెలుగు నటి శృతి తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అంటూ ఏకంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజాపై సంచలన ఆరోపణలు చేసింది.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఉన్న శివాజీరాజా తనను మభ్యపెట్టేందుకు ప్రయత్నించాడంటూ ఆరోపణలు చేసింది శృతి. ఓ మీడియా వేదిక‌గా శృతి శివాజీ రాజాపై ఆరోప‌ణ‌లు చేసింది.శివాజీ రాజా నన్ను గతంలో హీరో శ్రీకాంత్‌కి పరిచయం చేస్తా.. దర్శకుడు కృష్ణవంశీకి పరిచయం చేస్తా అంటూ మభ్యపెట్టాడు. వేరే అమ్మాయిలను కూడా వాడుకున్నాడు. వాళ్లు కూడా బయటకు వచ్చి ఆధారాలతో సహా బయటపెట్టేందుకు రెడీగా ఉన్నారు.ఇలాంటి వాళ్లు అధ్యక్ష‌లుగా ఉంటే మాకు ఏవిధాంగా న్యాయం జ‌రుగుతుంద‌ని శృతి ఆవేద‌న వ్య‌క్తం చేసింది.టాలీవుడ్ టాప్ హీరోలుగా ఉన్న చిరంజీవి, బాల‌కృష్ణ లాంటి వాళ్లు ఉంటేనే త‌మ‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని శృతి అభిప్రాయ‌ప‌డింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -